ఈ రోజుల్లో కమ్యూనికేషన్ రంగానికి ఉన్న క్రేజి దేనికి లేదు. ఒకప్పుడు బంధువులను పలకరించుకోవాలంటే ఉత్తర ప్రత్యుత్తరాలు ఉండేవి. తర్వాత ఫోన్ సదుపాయం వచ్చింది. కానీ అప్పట్లో దీని విలువ చాలా ఉండేది ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలంటే టైమ్ చూసుకొని మాట్లాడేవారు. కానీ విస్తరిస్తున్న టెక్నాలజీ వినియోగ దారులకు మరింత సదుపాయాలు కల్పిస్తూ సెల్ ఫోన్ వచ్చింది.  మరి కాల్స్ విలువ కూడా అప్పట్లో బాగా ఉండేవి రాను రాను వీటి రేట్లు కూడా తగ్గిపోవడం అన్ని ఫీచర్లు ఉన్న సెల్ ఫోన్ వినియోగదారుడికి చీఫ్ రేట్లో రావడం తో వీటి వినియోగం మరింత ఎక్కువ అయ్యింది.


టెలిఫోన్ సృష్టికర్త అలెగ్జాండర్ గ్రహంబెల్


అప్పట్లో రోమింగ్ రేట్లు బాగా ఉండేవి దూరాన ఉన్న మన బంధువులకు, స్నేహితులతో మాట్లాడాలంటే కాల్స్ రేట్లు చూసి బయపడే వారు కాని ఇప్పడు అది కూడా మరింత తక్కువ అయ్యింది. జాతీయ రోమింగ్ కాల్స్, టెక్ట్స్ మేసేజస్ ఛార్జీలు మరింత చౌక కానున్నాయి. వాటిపై సీలింగ్ టారిఫ్ లను ట్రాయ్(టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) తగ్గించింది. నూతన ఛార్జీలు మే 1 నుంచి అమల్లోకి వస్తాయి. రోమింగ్ ఛార్జీలు ఇక ముందు ఈ విధంగా ఉండనున్నాయి.


లోకల్ కాల్స్ కు నిమిషానికి రూపాయి నుంచి 80 పైసలు, ఎస్టీడీ కాల్స్ కు నిమిషానికి రూ.1.50 నుంచి రూ.1.15కు తగ్గుతాయి. ఇక రోమింగ్ లో ఉండగా వచ్చే ఇన్ కమింగ్ కాల్స్ కు.. నిమిషానికి 75 పైసలు నుంచి 45 పైసలకు, లోకల్ ఎస్.ఎం.ఎస్ లకు రూపాయి నుంచి 25 పైసలు, ఎస్టీడీ ఎస్.ఎంఎస్ పంపితే రూ.1.50 పైసలు నుంచి 38 పైసలుకు ఛార్జీలు తగ్గుతాయి. కొత్త ఛార్జీలతో కాల్ చార్జీలు 20శాతం, మేసేజ్ రేట్లు 75 శాతం తగ్గాయి. సో సెల్ ఫోన్ వినియోగదారుల ఇక హాయిగా రోమింగ్ కాల్స్ చేసుకోవచ్చు అంతే కాదు భవిష్యత్ లో మరింత తక్కువ అయ్యే చాన్సులు కూడా ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: