ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేశ్ ఇప్పుడిప్పుడే రాజకీయ ఓనమాలు నేర్చుకుంటూ ప్రజల్లోకి వెళుతున్నాడు. అయితే లోకేష్ బాబు తన సొంత నియోజకవర్గంలో రైతులు నిలదీయడంతో ఒకింత కిన్నుడైపోయాడు.   టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త హోదాలో.. కార్యకర్తల సంక్షేమ యాత్ర ప్రారంభించడానికి మంగళవారం కుప్పం  వచ్చారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడటానికి ప్రయత్నించి ఆయనను రైతులు నిలదీశారు. రుణమాఫీ విషయంలో తమకు అన్యాయం అయ్యిందని ఈ విషయంపై న్యాయం చెప్పమని అడిగారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు రైతుల వద్దకు వచ్చి ఎన్నో వాగ్ధానాలు చేశారని ముఖ్యంగా   షరతులు లేకుండా రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు.

దీంతో ఇతర పార్టీ వాళ్లతో కూడా టీడీపీకి ఓట్లు వేయించాం. కానీ అధికారంలో కొచ్చిన తర్వాత షరతులు విధించడంతో చాలామందికి రుణ మాఫీ జరగలేదు. పాత రుణాలు చెల్లించాలని బ్యాంకుల నుంచి నోటీసులు కూడా అందుతున్నాయి. తిరిగి కొత్త రుణాలు కూడా ఇవ్వడం లేదు' అని కార్యకర్తలు లోకేశ్‑ని నిలదీశారు. బ్యాంకర్లతో మాట్లాడి న్యాయం చేస్తామని లోకేశ్ హామీ ఇచ్చినా..కార్యకర్తలు వినకపోవడంతో నిరసనల మధ్యే యాత్ర కొనసాగించాల్సి వచ్చింది.


మరింత సమాచారం తెలుసుకోండి: