భారత ప్రజాస్వామ్యంలో సుదీర్ఘకాలం దేశాన్ని పాలించిన అఖిల భారత జాతీయ కాంగ్రెస్‌ పార్టీ ప్రస్తుత రాజకీయవ్యవస్థలో కొత్తసవాళ్లు ఎదుర్కొంటోంది. యుపిఏ, ఎన్‌డిఎ కూటమిలుగా రాజ కీయాధికారం కేంద్రంలో ఆధిపత్యం వహిస్తున్నా కాంగ్రెస్‌, భారతీయ జనతా పార్టీలనేతృత్వమే దేశాన్ని నడిపిస్తోంది.ఈ రాజకీయ నేపథ్యంలో ఇటీవల పరాజయం పాలైన కాంగ్రెస్‌ నాయకత్వంలో తీవ్ర అస్థిరత నెలకొనిఉంది. జవహర్‌లాల్‌నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీల వారసత్వప్రాబల్యం తప్ప మరో అగత్యంలేని కాంగ్రె స్‌పార్టీకి సోనియా నాయకత్వంలోని రాహుల్‌ గాంధీయే శరణ్యంగా కాంగ్రెస్‌ అధిస్ఠానం భావించింది. అప్పటికీ రాహుల్‌, దేశానికి ప్రధాని కాగల యువరాజుగా ప్రచారం కొనసాగింది. పార్టీని నడిపించ డానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా రాహుల్‌ మాట వేదవాక్కుగా సర్వాధి పత్యంతో తిరుగులేని యువనేతగా ఎఐసిసి గుర్తించింది. ప్రధాని మన్మోహన్‌సింగ్‌ కేబినెట్‌ మంత్రివర్గం నేరస్థులుగా  ప్రకటించబడిన ఎమ్‌పి,ఎమ్మెల్యేలను తక్షణ అనర్హతనుంచి రక్షించడానికి 2013 సెప్టెంబరు నెలాఖరులో జారీ చేసిన ఆర్డినెన్స్‌ను రాహుల్‌ పూర్తి నాన్‌సెన్స్‌గా వ్యాఖ్యానిస్తూ చింపి పారేయాలని పేర్కొనటం దానిని క్యాబినెట్‌ ఉపసంహరించుకోవటం,రాహుల్‌కు పార్టీలోఉన్న ఆధిప త్య ఆధిక్యతను స్పష్టం చేసింది. అప్పట్లో అది రాహుల్‌కు పార్టీపై  ఉన్న పట్టు. రాహుల్‌ గాంధీ కొత్తతరం యువతను పార్టీలోకి ఆహ్వా నించారు. కాని ఆయన ఆకాంక్ష నెరవేరలేదు.


కాంగ్రెస్‌పార్టీ ఇటీవల ఎన్నికలలో మోడీ ప్రభంజనానికి తలవంచక తప్పలేదు. ప్రధాని మన్మోహన్‌సింగ్‌, విధేయత శృతిమించి సమర్థతను మింగివేయ డంతో సోనియా నాయకత్వం నిర్వీర్యమైంది.ఊకదంపుడు నినా దాలు, బిజెపిపట్ల ప్రజలలో వ్యతిరేకత సృష్టించే ప్రయత్నాలు, ఉప న్యాసాలు సత్ఫలితాలు ఇవ్వలేదు.సోనియా ఒంటెత్తుపోకడ ధోరణి, రాహుల్‌ కు సమర్థవంతమైన మార్గదర్శకత్వం లేకపోగా వైఫల్యం కొట్టొ చ్చినట్టు స్పష్టమైంది.కాంగ్రెస్‌ ప్రాభవానికి కంచుకోట అయిన ఆంధ్ర ప్రదేశ్‌ విభజన అటు రెండు తెలుగు రాష్ట్రాలలో పార్టీని సిగ్గుతో తలవంచుకొనే అవమాన పరాజయానికి గురిచేసింది. ఘోర ఓటమి పార్టీని అప్రతిష్టపాలు చేయటమే కాక రాహుల్‌ను తీవ్ర నిరాశతో రాజకీయాల నుంచి పారిపోయే పరిస్థితి కల్పించింది.రాహుల్‌ గాంధీ సెలవు తీసుకొన్నారనే ప్రచార ప్రకటన యావ ద్భారత దేశంలో హాస్యాస్పదమైంది. ప్రస్తుత స్థితిగతులలో ప్రధాన ప్రతిపక్షంగా, ఎన్‌డిఎ ప్రభుత్వాన్ని ఎదుర్కోవలసిన ప్రస్తుత రాహు ల్‌ యువనాయకత్వం నిస్తేజమైంది. జవహర్‌లాల్‌ అనంతరం ఇందిరా, రాజీవ్‌లకు ప్రధానిగా విజయవంతంగా దేశాన్ని నడిపించ డానికి పార్టీలో సీనియర్‌ మేధావివర్గం అండదండలుండేవి. రాజీవ్‌ గాంధీ హత్యానంతరం కొంతకాలం స్తబ్దత, నిర్లిప్తతతో వ్యవహరించిన సోనియా కాంగ్రెస్‌ అధ్యక్ష పగ్గాలు చేపట్టినా రాహుల్‌కు సకాలంలో ప్రధాని బాధ్యత అప్పగించలేకపోవడం, తాను కూడా దేశ ప్రధాని కాలేకపోవడం, భారత జాతీయ కాంగ్రెస్‌, భవిష్యత్తును అగమ్యగోచరం చేస్తోంది. సుదీర్ఘ రాజకీయచరిత్ర నిర్మించుకొన్న కాంగ్రెస్‌ అటు వారసత్వ శృంఖలాల నుంచి బయటపడలేక ఇటు నూతన నాయకత్వాన్ని ప్రతిష్టించుకోలేని దశలో చిక్కుకొంది. జవ హార్‌లాల్‌ నెహ్రూ ముని మనువడు అయిన రాహుల్‌ గాంధీని ఆదు కోవడానికి కామరాజ్‌ వ్యూహాలులేవ్ఞ.సోనియాకి పార్టీలో వందిమాగ ధులు ఉన్నా ప్రజలలో పలుకుబడి తగ్గింది. మన్మోహన్‌సింగ్‌ తటస్థ మౌనవైఖరి కారణంగా మంత్రుల అవినీతి నిలయతాండవంచేసింది. అవకాశాన్ని చాకచక్యంగా అందిపుచ్చుకొన్న నరేంద్రమోడీ ప్రజలలో కొత్త ఆశలు చివ్ఞరింపుచేస్తున్నారు. అవసరమైనప్పుడు జాతిపితగా గాంధీజీని స్మరిస్తున్నారు. డిజిటల్‌ ఇండియా, మేక్‌ ఇన్‌ ఇండియా, స్వచ్ఛభారత్‌ వంటి పదాలు ప్రజలను ఊరిస్తున్నాయి.అమ్మ, అక్క, బంధుత్వ సాన్నిహిత్యం తప్ప రాహుల్‌ ఒంటరిగా వారసత్వ బాధ్య తను సీరియస్‌గా పట్టించుకోలేని వ్యక్తిత్వంతోపార్టీ పట్ల బాధ్యతా రాహిత్యంతో వ్యవహరిస్తున్నాడు. వ్యవసాయంలో పంట పండించ టంలో నిరాశా నిస్పృహలకు గురైన రైతాంగం క్రాప్‌ హాలిడే ప్రకటించినట్లుగా రాహుల్‌ గాంధీ పొలిటికల్‌ హాలీడేగా అదృశ్యం కావడం దేశ ప్రజలకు వింత కలిగిస్తోంది. అవివాహితుడైన రాహుల్‌కు 45 ఏళ్లు వచ్చాయి. తదనంతరం భారత ప్రజాస్వామ్యంలో గాంధీ పేరిట నెహ్రూ వారసత్వం మున్ముందు కొనసాగే పరిస్థితి ప్రస్తుతం కనపడటం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: