రాహుల్ గాంధీకి, TCS కి లింకేంటని అనుకుంటున్నారు కదూ. మామూలుగా అయితే ఎలాంటి సంబంధం ఉండదు. కానీ యాధృచ్ఛికంగా లింకు కుదిరింది. రాహుల్ గాంధీ 56 రోజుల మాయం తరువాత ఢిల్లీ వచ్చాడు. అదే రోజు TCS ఉద్యోగులకు ఊహించని రీతిలో బోనస్ వచ్చింది. కంపెనీ చరిత్రలో ఎప్పుడూ లేనంతగా వన్ టైమ్ బోనస్ వచ్చింది. ఈ బోనస్ మొత్తం ఎంతో తెలుసా రూ.2,628 కోట్లు. ఇంత పెద్ద మొత్తంలో బోనస్ ఇచ్చిన కంపెనీ మరొకటి ఇండియాలో ఉండదేమో. 3 లక్షల మందికి పైగా ఉద్యోగులు ఉన్న సంస్థలో వన్ టైమ్ బోనస్ ఇవ్వడం సాధారణం విషయం కాదు.

కంపెనీ మేనేజ్ మెంట్ ఇంత మంచి నిర్ణయం ఎందుకు తీసుకుందా? అని ఆలోచిస్తున్న TCS ఉద్యోగులకు రాహుల్ గాంధీ కనిపించారు. ఆయన తిరిగి ఢిల్లీకి వచ్చిన రోజే బోనస్ రావడంతో కొందరు TCS ఉద్యోగులు.. సోషల్ మీడియాలో రాహుల్ కు థాంక్స్ చెప్పారు. ఇండియాలో ఇలాంటి సెంటిమెంట్లు ఎక్కువ. దేని దేనికో ముడిపెడుతుంటారు. మంచి జరిగితే ఒక రకంగా, చెడు జరిగితే మరో రకంగా అన్వయించుకుంటూ ఉంటారు. TCS ఉద్యోగులు తమకు మంచి జరిగింది కాబట్టి ఆరోజున్న రాహుల్ కమ్ బ్యాక్ వార్తను లింక్ అప్ చేసుకున్నారు. వన్ టైమ్ బోనస్ ఇవ్వకుండడా ఆరోజు TCSలో వెయ్యి మందినో.. రెండు వేల మందినో ఉద్యోగం నుంచి తొలగించి ఉంటే రాహుల్ వచ్చాడు.. మా ఉద్యోగాలు పోయాయి.. ఏం చేస్తాం రాహుకాలం అనుకునే వారు.

కంపెనీ మేనేజ్ మెంట్ భారీ స్థాయిలో వన్ టైమ్ బోనస్ ఇవ్వడంతో గడిచిన ఆరు నెలల్లో అతి తక్కువగా మార్చి క్వార్టర్లో నికర లాభాన్ని చూపించింది. దీంతో కంపెనీ షేరు ధర 4 శాతం పడిపోయింది. TCS షేర్లు ఉన్న ఆ కంపెనీ ఉద్యోగులకు ఒక వైపు నుంచి లాభం వచ్చినా షేరు ధర పడిపోవడం వల్ల మరోవైపు నష్టం వచ్చింది. ఈ నష్టం పేపర్ మీదే ఉంటుంది. అంటే నోషనల్ లాస్ అన్నమాట. రేప్పొద్దున కంపెనీ నుంచి గుడ్ న్యూస్ వస్తే మళ్లీ షేరు ధర పెరిగే అవకాశం ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: