ఈ మాట అంటున్నది స్వయంగా హర్యానా రాష్ట్ర అంబాసిడర్గా కొనసాగుతున్న యోగా గురు రాందేవ్ బాబా.  ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి అనిల్విజ్ కొద్ది రోజుల క్రితం రాందేవ్ బాబాకు మంత్రి హోదా కల్పిస్తామని ప్రకటించారు.  అయితే రాందేవ్ బాబా యోగ శిక్షణ మాత్రమే కాకుండా ప్రజా సేవా కార్యక్రమంలో కూడా చురుకుగా పాల్గొంటారు. ప్రభుత్వ వైఖరిపై నిస్పక్షపాతంగా మాట్లాడుతారు.


అన్నా హజారేకు మద్దతు గా రాందేవ్ బాబు


ఆమధ్య అన్నా హజారే లోక్ పాల్ బిల్లుపై పోరాటం చేసే సమయంలో ఆయనకు మద్దతుగా దగ్గర ఉండి మరీ పోరాడారు. మోడీ ప్రచార సమయంలో కూడా కాంగ్రెస్ పై వ్యతిరేక ప్రచారం చేశారు. ఈ విషయాల్నీ దృష్టిలో పెట్టుకొని రాందేవ్ బాబాకు క్యాబినెట్ హోదా కల్పించాలని నిర్ణయించారు.   రాందేవ్ పర్యవేక్షణలో యోగా, ఆయుర్వేద విద్యను అభివృద్ధి చేయనున్నట్లు అనిల్విజ్ తెలిపిన విషయం తెలిసిందే. ఈ మేరకు పాఠ్యాంశాల్లో యోగాశాలలు నిర్మించనున్నట్లు విజ్ పేర్కొన్నారు. తనకు ఎలాంటి మంత్రి పదవులు వద్దని సున్నితంగా తిరస్కరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: