భారీ భూకంపం నేపాల్‑ను అతలాకుతలం చేసింది. శనివారం నేపాల్ కేంద్రంగా చేసుకొని  నాలుగు దేశాల్లో భూకంపంతో తీవ్ర నష్టం వాటిల్లింది. ముఖ్యంగా నెపాల్ లో ఈ తీవ్రత చాలా ఎక్కువ గా ఉంది. భారీ భూకంపం తో నేపాల్ రాజధాని ఖాట్మాండ్ లో చాలా వరకు ప్రాణ  నష్టం, ఆస్తి నష్టం వాటిల్లింది. పురాతన ఇళ్లు కూలిపోయాయి శిథిలాల్లో చిక్కుకున్న వారి ఆహాకారాలతో మిన్నంటాయి. ఇప్పటికే రెస్క్యూ టీమ్ వచ్చి బాధితులను రక్షించే కార్యక్రమంలో ఉంది. నేపాల్ లో ఎమర్జెన్సీ విధించారు.  


భూకంప ధాటికి రోడ్లు చీలిపోయాయి.


ఇప్పటివరకూ అందిన వివరాల ప్రకారం నలుగురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. పురాతన భవనాలు, ఆలయాలు, చారిత్రక కట్టడాలతో పాటు గృహ సముదాయాలు, కార్యాలయాలు కుప్పకూలాయి. చాలా ప్రాంతాల్లో రహదారులు ధ్వంసం అయ్యాయి. కీర్తిపూర్‌కు 69 కిలోమీటర్ల దూరంలో మరో ప్రకంపన చోటు చేసుకుంది.


రోడ్లు విరిగిపోవడంతో ప్రజలు ఆందోళనకు గురి అవుతున్నారు.


 రిక్టర్ స్కేల్ పై తీవ్రత 7.9గా నమోదైంది. మరోవైపు గాయపడినవారు పెద్ద ఎత్తున ఖాట్మాండ్‑లోని ఆస్పత్రులకు తరలి వస్తున్నారు. హిందూ దేవాలయం శిథిలాల కింద 500 మంది ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఖాట్మండ్‌లో చారిత్రక ధరారా టవర్ కూలిపోయింది. టవర్ కింద 400 మంది చిక్కుకున్నారు.


భూకంపం ప్రభావంతో కూలిపోయిన ఇళ్లు


పాత ఖాట్మాండ్‑లోని హన్‑మాన్ డోక ప్రాంతంలో భూకంప ప్రభావం తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: