రోడ్డు ప్రమాద మరణాలు సంవత్సరానికి రెండు లక్షల చొప్పున తగ్గించడం, ఏడాదికి 10 లక్షల కొత్త ఉద్యోగాలు కల్పించడం, జిడిపి ఏడాదికి 4 శాతం వృద్ధి సాధించడం లక్ష్యాలుగా ఈ బిల్లు తెస్తునట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇంత అద్భుత లక్ష్యాలతో తెస్తున్న ఈ బిల్లును ప్రతి ఒక్కరూ స్వాగతించాల్సిందే. మద్దతు నివ్వాల్సిందే. అయినా అన్ని కార్మిక సంఘాలు, ఆలిండియా మోటార్‌ ట్రాన్స్‌ పోర్టు కాంగ్రెస్‌, క్యాబ్‌ ఆపరేటర్లు, ఆర్‌టిసి యాజమాన్యాలు, ప్రభుత్వ రవాణా శాఖ సిబ్బంది, అధికారులు, పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాయి.

స్తంభించనున్న రోడ్డు రవాణా వ్యవస్థ


దేశవ్యాప్తంగా రవాణ సమ్మె గురువారం నాడు జరగబోతోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకు వస్తున్న రవాణ భద్రత బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కార్మిక సంఘాలు,రవాణా సంఘాలు దేశ వ్యాప్త సమ్మెకు పిలుపు ఇచ్చారు. ఎపి, తెలంగాణలలో కూడా ఈ సమ్మె గట్టిగా జరగవచ్చు.ఆటోలు,టాక్సీలు,లారీలు, ప్రైవేటు బస్ లు ఇలా వివిధ రంగాలకు చెందినవారు ఈ సమ్మెకు మద్దతు ఇస్తున్నారు.వాటితోపాటు ఈ సమ్మెకు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కూడా మద్దతు తెలిపింది. ఈ సమ్మె కారణంగా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా రవాణా స్తంభించే అవకాశం ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: