కేసీఆర్ కూ, ఏబీఎన్ రాధాకృష్ణకు ఉన్న కోల్డ్ వార్ గురించి కొత్తగా చెప్పేదేమీలేదు.. కేసీఆర్ కానీ.. ఆయన టీమ్ గానీ ఎక్కడ దొరుకుతారా అని రాధాకృష్ణ వేయి కళ్లు పెట్టుకుని చూస్తుంటాడు. ఏమాత్రం ఛాన్సు దొరికినా.. వదిలే ప్రసక్తే లేదు. లేటెస్టుగా టీ న్యూస్ స్ట్రింగర్ చేసిన ఓ తప్పు.. రాధాకృష్ణ చేతిలో బ్రహ్మాస్త్రంగా మారింది. 


వరంగల్ జిల్లా జనగామలో 

అసలు విషయం ఏంటంటే.. వరంగల్ జిల్లా జనగామలో కృష్ణమూర్తి అనే వ్యాపారిని టీన్యూస్, హెచ్ఎంటీవీ స్ట్రింగర్ల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేశాడని చెబుతున్నారు. జనగామలో కృష్ణమూర్తి కిరాణా వ్యాపారం నడుపుతుంటారు. ఆయన గోదాముల్లో రేషన్ బియ్యం అక్రమంగా నిల్వచేశారని.. తమకు డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశారు.


గురువారం పూర్తి విచారణ జరుపుతామన్నారు


మొదటిసారి లొంగకపోయేసరికి.. విలేఖరి.. సీటీవో రామాంజనేయులుకు ఫిర్యాదు చేశారట. ఆయన డాక్యుమెంట్లు సరిగా లేవంటూ కృష్ణమూర్తికి 10 వేలు జరిమానా విధించారట.అంతేకాకుండా కృష్ణమూర్తికి చెందిన మరో గోదాంలో పెద్ద ఎత్తున అక్రమ సరుకులు నిల్వ చేశారంటూ ఆ విలేకరి మళ్లీ సీటీవోను పిలిపించారు. అధికారులు ఆ గోదాములను సీజ్ చేసి.. గురువారం పూర్తి విచారణ జరుపుతామన్నారు. 


హైదరాబాద్ ఆపోలోలో చికిత్స పొందుతున్నారు


ఈ లోపు మళ్లీ విలేఖరి వేధింపులు మొదలుపెట్టారట. పది లక్షలు ఇవ్వకపోతే.. నీ వ్యాపారం మొత్తం బంద్ అవుతుందని హెచ్చరించారట. ఈ వేధింపులు తట్టుకోలేక.. అంత డబ్బు ఇవ్వలేక.. ఆయన ఆత్మహత్యాయత్నం చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ ఆపోలోలో చికిత్స పొందుతున్నారు. ఈ ఇష్యూను ఏబీఎన్ రోజంతా తన ఛానళ్లో ఫుల్లుగా ఫోకస్ చేసింది. ఓ స్ట్రింగర్ చేసిన తప్పును ఏకంగా ఛానల్ మొత్తానికి అన్వయించేసి.. టీ న్యూస్ బరితెగింపు అని టైటిల్ పెట్టి కుమ్మేసింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: