చంద్రబాబు ఏ మీటింగ్ లో మాట్లాడటం మొదలుపెట్టినా.. అన్యాయంగా రాష్ట్రాన్ని విభజించారంటూ మొదలుపెడతారు. లోటు బడ్జెట్ తో ఏపీ ప్రస్తానం మొదలైందని లెక్చరు దంచుతారు. కనీసం ఉద్యోగులకు జీతాలు ఇచ్చుకోవడం కూడా కష్టమేనంటారు. 

ఇదేం దుబారా..


కానీ అలాంటి నేత ఖజానాను మాత్రం దుబారా చేస్తున్నారట. చంద్రబాబు దుబారాపై ఓ ఆంగ్ల పత్రిక సంచనల కథనం ప్రచురించింది. బాబు దుబారాను అంకెలతో సహా బయటపెట్టింది. ఇంతవరకు సుమారు వంద కోట్ల రూపాయలను క్యాంప్ ఆఫీస్ ల పేరుతో, భద్రత, ప్రత్యేక విమానాలు, ఆఫీస్ ల పేరుతో ఖర్చు చేశారని స్టోరీ ఇచ్చింది. 

పేద రాష్ట్ర పాలన ఇలాగేనా..


సెక్రటేరియట్ లో ముందుగా హెచ్ బ్లాక్ లో ఏడు కోట్లు ఖర్చు పెట్టారని, ఆ తర్వాత వాస్తు పేరుతో దానిని వదలి వేశారని, మరో ఇరవై కోట్లు ఖర్చు చేసి ఎల్.బ్లాక్ లో రెండు ఫ్లోర్ లను సిద్దం చేశారని, ప్రత్యేక ప్రవేశద్వారం, లిఫ్ట్ ల కోసం మరో ఐదు కోట్లు ఖర్చు చేశారని ఆ పత్రిక పేర్కొంది. 

ఈ ఇంటికి నెలకు 2 లక్షలు


ఆరు కోట్లుఖర్చుచేసి లేక్ వ్యూ అతిధి గృహాన్ని రిపేరు చేయించినా, ఇప్పుడు దానిని వారానికి ఒక్క రోజు కూడా వాడడం లేదట. ఇప్పుడు చంద్రబాబు మరో ఇంటికి నెలకు రెండు లక్షల అద్దె చెల్లిస్తున్నారు. మూడు క్యాంప్ ఆఫీస్ లకు నలభై ఐదు కోట్లు ఖర్చు చేశారని ఆ ఇంగ్లీష్ పేపర్ రాసింది. ఈ స్టోరీ బాబు ఇమేజీకి డ్యామేజీయేనని పార్టీ వాళ్లే చెవులు కొరుక్కుంటున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: