ఒక మనిషిని పరీక్షించాలంటే అతనికి అధికారం ఇచ్చి చూస్తే చాలట. ఆ కుర్చీలో ఇంకో మహత్యం కూడా ఉంది. అధికారంలో ఉన్నవాళ్లు.. ఇక ఎల్లకాలం తాము అధికారంలో ఉంటామనే భావిస్తుంటారు. ఓటమి గురించిన ఊహను కూడా వారు భరించలేదు. 

కేసీఆర్ కు ఎన్నికల భయం..?


ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ పరిస్థితి కూడా అలాగే ఉన్నట్టు కనిపిస్తోంది. తొలివిడత ఐదేళ్లపాలనలో ఓ ఏడాది పూర్తయిందో లేదో.. అప్పుడే సెకండ్ టర్మ్ గురించి కలలు కనేస్తున్నారు. నాగార్జునసాగర్ లో జరుగుతున్న పార్టీ రాజకీయ శిక్షణ తరగతుల్లో.. పార్టీ నాయకులకు అప్పుడు విజయరహస్యాలు బోధిస్తున్నారు.  

నాయకులారా.. జాగ్రత్త..


వచ్చే ఎన్నికలలో కూడా అధికారం మనదేనని..  అదేమంత పెద్ద సమస్య కాదంటూ ఆయన నాయకుల్లో ఆత్మవిశ్వాసం నింపుతున్నారు. ప్రజాప్రతినిదులు ప్రజలలో మంచి పేరు తెచ్చుకోవాలని వారికి నూరిపోస్తున్నారు. డబ్బు సంపాదను ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వవద్దని ప్రజల తరపునే పోరాడాలని ఉద్బోధిస్తున్నారు. 

రిత్ర మరవద్దంటున్న కేసీఆర్

Image result for kcr at nagarjuna sagar training

అంతేకాదు.. సరిగ్గా పాలించకపోతే.. జనం తమను చిత్తుగా ఓడిస్తారని కూడా కేసీఆర్ చెబుతున్నారు. ఎన్నో ప్రభుత్వాల మాదిరి చరిత్ర గర్భంలో కలిసిపోతామని కేసీఆర్ నాయకులను హెచ్చరిస్తున్నారు. అంటే కేసీఆర్ కు అప్పుడే ఎన్నికల భయం మొదలైందా..? 



మరింత సమాచారం తెలుసుకోండి: