కొన్ని చదువులు విచిత్రంగా ఉంటాయి. వాటి కోసం సహజమైన సిగ్గు, లజ్జ, భయం పక్కకుపెట్టాల్సి ఉంటుంది. డాక్టర్ కావాల్సిన వ్యక్తి.. బల్లులను కోయడానికి భయపడితే డాక్టర్ కాలేడు. ఆర్టిస్టు వంటి వారు నగ్నంగా బొమ్మలు గీయడం కూడా అలాంటిదే.. కొన్ని వృత్తుల్లో అవి తప్పవు మరి. 

కానీ ఇప్పుడు అదే అమెరికాలో కొత్త వివాదమై కూర్చుంది. విజువల్ ఆర్ట్ అనే కోర్సుకు సంబంధించిన కోర్సు పరీక్షను నగ్నంగానే రాయాలని ఓ ప్రొఫెసర్ రూల్ పెట్టారట. అమెరికాలోని కాలిఫోర్నియా ప్రాంతంలోని శాండియాగో యూనివర్సిటీలో ఇది సంచలనం సృష్టిస్తోంది. 

నగ్న పరీక్ష


ఫ్రొఫెసర్ రికార్డే కోర్స్ పాస్ కావాలంటే చివరి పరీక్షకు విద్యార్ధులు నగ్నం రావాలని స్పష్టం చేస్తున్నారు. దీనిపై ఒక విద్యార్ది తల్లి తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ స్థానిక టీవీ చానల్‌ కు ఇంటర్వ్యూ ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఐతే.. తనకు ఇదేం కొత్త కాదని.. తాను పదకుండేళ్లుగా ఇలాగే చేస్తున్నానని, ఇప్పుడు ఇది ఎందుకు వివాదం అవుతుందని ఆయన ప్రశ్నిస్తున్నారు. చివరకు తల్లిదండ్రుల ఒత్తిడికి తలొగ్గిన యూనివర్శటీ నిర్వాహకులు నగ్న పరీక్షను రద్దు చేశారట. 



మరింత సమాచారం తెలుసుకోండి: