ఒక సీఎం కూతురు ప్రభుత్వాధికారి లంచం ఇవ్వ జూపింది అతడు తిరస్కరించడంతో అసలు విషయం బయట పడింది.  ఒక సామాన్యమైన ఉద్యోగిగా ప్రస్థానం మొదలు పెట్టి ఇప్పుడు ఢిల్లీ పీఠం పై కూర్చునే స్థాయికి ఎదిగిన వ్యక్తి అరవింద్ కేజ్రీవాల్. సామాన్యుడి చేతిలోకి రాజకీయం అనే విధంగా ఢిల్లీలో ఆమ్ ఆద్మీ అనే పార్టీని స్థాపించి ‘చీపురు’ ని పార్టీ గుర్తుగా ఎంచుకొని అవినీతిని ఊడ్చి పడేద్దాం అనే నినాదంతో గెలుపొందాడు కేజ్రీవాల్.

కేజ్రీవాల్ కుటుంబ సభ్యులు


 విషయానికి వస్తే.. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూతురు ఓ ప్రభుత్వాధికారికి లంచం ఇవ్వబోయింది, అదేంటీ అవినీతిని అంతం చేయాలనే లక్ష్యంతో ఉన్న  కేజ్రీవాల్ కూతురే లంచం ఇవ్వడమేంటి అని ఆశ్చర్యంగా ఉందా మరి అక్కడే ఉంది ట్విస్ట్..  కేజ్రీవాల్ ఆటో డ్రైవర్ల సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఢిల్లీలో లంచగొండి తనం చాలా వరకు తగ్గిందని దీనికి ఉదాహారణే కేజ్రీవాల్ కూతురు లెర్నర్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడానికి కార్యలయంకి వెళ్లింది. అయితే అక్కడ తన వంతు వచ్చే వరకు ఎదురు చూసింది. అధికారి దగ్గరికి వెళ్లి కావాలనే ఒక ముఖ్యమైన సర్టిఫికేట్ తీసుకురాలేదని చెప్పడంతో అధికారి లైసెన్స్ ఇవ్వడానికి నిరాకరించారు.

కేజ్రీవాల్ కూతురు హర్షిత 


దీంతో ఆమె అతనికి లంచం ఇస్తానని చెప్పిందట. కానీ ఆప్రభుత్వాధికారి దానిని తిరస్కరించి లైసెన్స్ ఇవ్వలేదట. తరువాత ఆమె మళ్లీ వెనక్కి వచ్చి సర్టిఫికెట్ ఇవ్వగా అందులో కేజ్రీవాల్ పేరు చూసి తన పని పూర్తి చేసి పంపారట. ఇలాంటి నీతి గల అధికారులు దేశం మొత్తం ఉంటే ప్రపంచ దేశంలో భారత దేశం అగ్రగామిగా నిలిచిపోతుంది కదా..


మరింత సమాచారం తెలుసుకోండి: