తెలుగు రాష్ట్రాలు రెండు గా విడిపోయిన తర్వాత ఏ రాష్ట్ర అభివృద్ది దిశగా ఆ రాష్ట్రాలు స్టెప్పులు వేసుకుంటూ ముందుకు సాగుతున్నాయి. మొన్నటికి మొన్న ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రి తనయులు అమెరికాకు వెళ్లి తమ తమ రాష్ట్రాల్లో పెట్టు బడులు పెట్టాలని ఐటీ నిపుణులకు సూచించారు. అలాగే తమ రాష్ట్రంలోని గ్రామాలను దత్తతు తీసుకోవాల్సిందిగా ఎన్ఆర్ఐలను ఒప్పించారు. ఈ రకంగా రాష్ట్ర అభివృద్ది కోసం తమ వంతు కృషి చేస్తున్నారు.


అమెరికాలో ఐటీ బృందంతో మంత్రి కేటీఆర్

ktr2

ఇందులో భాగంగా  తెలంగాణ ఐటి శాఖ మంత్రి కె.తారక రామారావు మైక్రోసాఫ్ట్ సి.ఇ.ఓ సత్య నాదేళ్లను కలుసుకున్నారు.  హైదరాబాద్ ను ఐటీ రంగంలో అతిపెద్ద సిటీగా మార్చాలని దీనికోసం ఐటీ నిపుణుల సహాయం కావాలని అందు కోసం  ఐటి రంగంలో పెట్టుబడులు సాదించేందుకు గాను అమెరికాలో పర్యటిస్తున్న కెటిఆర్ ఆయా కంపెనీల సిఇఓ లు, ఇతర ప్రముఖులతో భేటీ అయ్యారు.

 

 జీఈ గ్రూప్ మాజీ చైర్మన్ జాక్ వెల్చ్‌ తొ  మంత్రి కేటీఆర్

ktr3

కేటీఆర్ అమెరికా పర్యటనలో భాగంగా  సియాటిల్ కు వెళ్లి తెలుగు వాడైన  సత్య నాదెళ్లతో భేటీ అయ్యారు. హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ విస్తరణ చేయాలని ఈ సందర్భంగా కెటిఆర్ కోరారు.హైదరాబాద్ లో ఐటి రంగానికి తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను కూడా ఆయన వివరించారు. సత్యనాదెళ్ల సానుకూలంగా విని కేటీఆర్ కృషికి తమ వంతు సహాయం చేస్తామని చెప్పినట్లు తెలుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: