60 సంవత్సరాల వయసులో అంగస్తంభన లోపంతో బాదపుడుతున్నావారు, భార్యను అసంతృప్తికి గురిచేస్తున్నాన్న అనుమానంతో కృంగిపోయే వారు ముందు డయాబెటీస్, బీ.పీ., రక్తనాళాలకు సంబంధించిన వ్యాధులున్నాయేమో పరీక్ష చేయించుకోండి. వీటివల్ల, వాడే మందులవల్ల కూడా అంగస్తంభన సమస్య వస్తుందంటున్నారు సెక్సునిపుణులు. అలాగే, టెస్టోస్టిరాన్ హార్మోన్ స్థాయి పరీక్ష చేయించుకోవాలి. కోరిక కలగడానికి, అంగస్తంభన కలగడానికి ఈ సెక్స్ హార్మోన్ చాలా అవసరం. ఈ హార్మోన్ వయసు పెరిగే కొద్దీ తగ్గే అవకాశం ఉంది. ఆండ్రాలజిస్ట్ పర్యవేక్షణలో హార్మోన్ థెరపీ తీసుకోవచ్చని అంటున్నారు. కానీ, దీనికి ముందు ప్రోస్టేట్ కేన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవాలి.


వృద్ధాప్యంలో అంగస్తంభనకు, వీర్య స్ఖలనానికి ఎక్కువ సమయం పట్టడం, చాలాసార్లు స్ఖలనం క్షణాల్లో జరిగిపోవడం, సెక్స్ కండరాలు పటుత్వం తగ్గిపోవడం జరుగుతుంది. అయితే, అనవసరంగా మందులు వాడే బదులు సెక్స్ గైడెన్స్ థెరపీలో భాగంగా ఎస్‌ఎఫ్‌ఇ, జిఎస్‌ఇ టెక్నిక్స్‌తో దంపతులిరువురూ సంతృప్తి పొందవచ్చు. వృద్ధాప్యంలో సెక్స్ ఫ్రీక్వెన్సీ తగ్గుతుందంటున్నారు. అది లైంగిక సామర్థ్యం తగ్గినట్లు కాదు. మీకు ఏ వ్యాధీ లేకపోతే జిఎస్‌టిలో భాగంగా కొన్ని ఎక్సర్‌సైజులు, టెక్నిక్స్ ద్వారా అంగస్తంభన లోపాన్ని, శీఘ్ర స్ఖలనాన్ని ఒక 50 శాతం తగ్గించవచ్చు.   



మరింత సమాచారం తెలుసుకోండి: