లారెన్స్ తీసిన కాంచన సినిమా అందరికీ గుర్తుంది కదా.. అందులో శరత్ (కాంచన) కుమార్ హిజ్రాగా నటించాడు, తన తల్లిదండ్రులు తనలోపాన్ని గుర్తించకుండా ఇంట్లోంచి వెళ్లగొడతారు. దేవుడు చేసిన పెట్టిన లోపానికి తనని బాధ్యత చేయడం ఎంతవరకు న్యాయం అని తనలాంటి మరో హిజ్రాను బాగా చదివించి డాక్టర్ ని చేస్తాడు. నిత్యం మనకు కనిపించే హిజ్రాలు బతకడానికి ఏదో బిక్షాటన పని చేస్తుంటారు. వాళ్లను చూస్తే కొంతమంది  భయపడటమో లేదా మామూలు జనాలలాగా కాకుండా కొంచెం వేరే కోణంతోనే చూస్తుంటాం. కానీ ఓ హిజ్రా ఉన్నత చదువులు చదువుకొని ఎందరో విద్యార్థుల జీవితాలు తీర్చిదిద్దే ప్రిన్సిపల్ బాధ్యత తీసుకోబోతుంది.

వివరాల్లోకి వెళితే పశ్చిమబెంగాల్ లోని కృష్ణానగర్ మహిళా కళాశాల పిన్సిపాల్ గా మానబీ బెనర్జిని నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. అంతకుముందు వరకు మానబీ బెనర్జి మహావిద్యాలయలో బెంగాలీ అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేశారు. ట్రాన్స్ జండర్ కాలేజీ ప్రిన్సిపాల్ కావడం భారత దేశంలోనే కాదు బహుశా ప్రపంచంలోనే ఇది ప్రథమం కావచ్చు. జూన్ 9న మానబీ ప్రిన్సిపాల్ గా బాధ్యతలు చేపట్టనున్నారు. కాలేజీ సర్వీసు కమిషన్ నిర్ణయం మేరకే ఆమెను ప్రిన్సిపాల్ గా నియమించారని వెల్లడించారు. తనను కళాశాల ప్రిన్సిపాల్ నియమించడం పట్ల మానబీ బెనర్జి ఆనందం వ్యక్తం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: