తెలంగాణ లో టీడిపీ తరుపున గట్టిగా మాట్లాడుతూ ప్రతిపక్షహోదాలో ఉండి పాలక పక్షాన్ని ఎండగడుతూ వస్తున్న టీడీపీ నేత ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి అనూహ్యంగా ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా వోటుకు నోటు కేసులో ఏసీబి వలలో పడ్డాడు. ఇప్పుడు ఆ కేసులో  ప్రథమ ముద్దాయి అయిన తెలుగు దేశం ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై ఈ రోజు కోర్టులో విచారణకు రానున్నది. మరో వైపు ఏసీబి అధికారులు మటుకు రేవంత్ ను తమ కస్టడికి అప్పగించాలని పిటీష్ దాఖలు చేశారు.

రేవంత్ రెడ్డిని జైలుకు తీసుకు వెళ్తున్నదృశ్యం


మరో వైపు రేవంత్ ను కలవడానికి వచ్చే టీటీడీపీ నెతలతో రేవంత్ తన బెయిల్ విషయం గట్టిగానే మాట్లాుడున్నట్టు వినవస్తుంది కారణం తన కూతురు నిశ్చితార్థం ఈ నెల 11న ఉండటంతో ఈ లోగా బెయిల్ వస్తు సంతోషంగా ఉంటుంది కోరినట్లు తెలుస్తుంది. రేవంత్ రెడ్డి తరపున జంద్యాల రవిశంకర్, ప్రమోద్ రెడ్డి అనే ఇరువురు లాయర్లు వాదించనున్నారు రేవంత్ కూతురు నిశ్చితార్థం సందర్భంగా మానవతా దృక్పధంతో బెయిల్ మంజూరి విషయం కూడా ప్రస్తావనకు తెస్తున్నట్లు తెలియవస్తుంది.

ఏసీబీ అధికారి ఏకే ఖాన్


ఇలాంటి తరుణంలో బెయిలు మంజూరు అవుతుందో లేదోనని ఉత్కంఠ నెలకొని ఉంది. ఒక వేళ ఏసీబీ వాదనలతో కోర్టు ఏకీభవించి బెయిలు మంజూరు కాని పక్షంలో తన కుమార్తె నిశ్చితార్ధ కార్యక్రమానికి కోర్టు అనుమతి తీసుకొని హాజరవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: