తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. ఏం జరుగుతుందో తెలియదు కానీ.. ఏదో జరగబోతుందన్న సంకేతాలు మాత్రం వెలువడుతున్నాయి. నోటుకు ఓటు కేసులో చంద్రబాబుకు నోటీసులిస్తారా.. చంద్రబాబుతో పాటు టీడీపీ ఎంపీలకూ నోటీసులిస్తారా.. అన్నది ఉత్కంఠకు దారి తీస్తుంది.

ఎన్టీఆర్ ట్రస్టు భవన్, చంద్రబాబు అద్దె నివాసం, సచివాలయం వంటి చోట్ల భారీగా పోలీసులను మోహరించారు. కేవలం నోటీసులే ఇస్తే.. ఇంత భారీ రక్షణ ఎందుకు.. అసలేంజరగబోతోందని ఇంత రక్షణ.. అర్థంకాని పరిస్థితి ఉంది. పైన చెప్పిన అన్ని ప్రాంతాల్లో పోలీసులతోపాటు మీడియా ప్రతినిధులు కూడా పెద్ద ఎత్తున మోహరించారు. 

ఉమ్మడి రాజధానిలో తీవ్ర ఉత్కంఠ.. 


చంద్రబాబు కూడా ఇతర కార్యక్రమాలు హఠాత్తుగా రద్దు చేసుకుని.. అందుబాటులో ఉన్న మంత్రులతో అర్జంటు సమావేశం నిర్వహించేశారు. అటు తెలంగాణ పోలీసు బాసులు గవర్నర్ తో భేటీ అయ్యారు. ఏపీ మంత్రులు కూడా గవర్నర్ ను కలుస్తారట. అంతే కాదు. తెలంగాణ సర్కారు చంద్రబాబుపై ఎలాంటి చర్యలు తీసుకున్నా.. తామూ అలాంటి చర్యలే తీసుకుంటామని సవాల్ చేస్తున్నారు. 

మరోవైపు వాట్సాపుల్లో సోషల్ మీడియాలో టీడీపీ నేతలకు నోటీసులపై మెస్సేజులపై మెస్సేజులు వచ్చేస్తున్నాయి. కీలకమైన విషయం ఏమింటంటే..  ఓటుకు నోటు కేసులో అసలైన ఫిర్యాదు దారుడు స్టీఫెన్ సన్ వాంగ్మూలాన్ని ఇంకా నమోదు చేయలేదు. అది కాస్తా మరోసారి వాయిదా పడింది. ఆ వాంగ్మూలం తర్వాతే ఎలాంటి చర్యలైనా తీసుకోవడం కుదురుతుందని చెబుతున్నారు.  ఏం జరుగుతుందో తెలియదు కానీ.. మొత్తానికి ఏదో జరగబోతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: