తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం రేపిన ఓటుకు నోటు కేసు వ్యవహారం ఏపీ అటు ఏపీ మంత్రులకు, ఇటు టీడీపీ ఎమ్మెల్సీల మెడకు చుట్టుకుంటుంది. తాజాగా తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు సి.ఎమ్.రమేష్ ఓటుకు నోటు కేసులో మీడియా తనపై దుష్ప్రచారం చేస్తున్నదని సీ.ఎం.రమేష్ మండిపడ్డారు. ఈ కేసులో రేవంత్ రెడ్డి వద్ద పట్టుబడ్డ ఏబై లక్షలు విషయంలో తన ప్రమేయం ఉన్నట్లు ఆ డబ్బుకూడా తనే ఇచ్చినట్లు మీడిక కథనాలు వస్తున్నాయని ఇందులో తన ప్రమేయం ఏం ఏదని రమేష్ అంటున్నారు.

నిజానికి ఆ డబ్బు తనదే అని తెలంగాణ ప్రభుత్వం నిరూపిస్తే ఎం.పీ. పదవికి రాజీనామా చేస్తానని రమేష్ సవాల్ విసిరాడు. వాస్తవానికి తెలంగాణ ఎసిబి తరకు ఇప్పటి వరకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని ఆయన చెప్పారు. అనవసరంగా మీడియా తనపై ప్రచారం జరుపుతుందని ఈ విషయంలో తాను చాలా అసహనానికి గురయ్యానని ఆయన విచారం వ్యక్తం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: