ఒకవైపు తెలుగురాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ పరువుపోతూ ఉంటే.. అటు ఢల్లీిలో తాము చక్రం తిప్పేస్తున్నామని, కేసీఆర్‌ ప్రభుత్వం చేస్తున్న కుట్రలకు చక్రం అడ్డు వేసేస్తాం అని ఆ పార్టీ వారు చాలా బిల్డప్‌లు ఇచ్చారు. అసలు కేసు ఓటుకు నోటు వ్యవహారం చుట్టూ తిరుగుతూ ఉంటే.. దాన్నిగురించి మాట్లాడకుండా.. తెదేపా నాయకులు సెక్షన్‌ 8 గురించే యాగీ చేస్తూ వచ్చారు. బుధవారం నాడు కేంద్ర హోంశాఖ జాయింట్‌ సెక్రటరీ అలోక్‌కుమార్‌ తన బృందంతో హైదరాబాదు వస్తున్నారని... సాయంత్రానికెల్లా గవర్నరు పరిధిలోకి శాంతిభద్రతలను తీసుకువెళ్లే పర్వం పూర్తవుతుందని మంగళవారం బీభత్సంగా ప్రచారం జరిగింది. కానీ.. తెదేపా పేల్చదలచుకున్న ఈ బాంబు తుస్సుమంది. కేంద్ర హోంశాఖ నుంచి ఎలాంటి అధికారులూ హైదరాబాదు రానేలేదు.


సెక్షన్‌ 8ను అమల్లోపెట్టడం, శాంతి భద్రతలను గవర్నరు పరిధిలోకి తీసుకువెళ్లడం గురించి ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే.. ఢల్లీి వెళ్లి అక్కడి ప్రభుత్వ పెద్దలకు విన్నవించుకున్నారు. అయితే వారు పట్టించుకున్న దాఖలాలు మాత్రం కనిపించ లేదు. అక్కడి మంత్రులు, ప్రధాని ఎవ్వరూ ఎలాంటి హామీ ఇచ్చినట్లు తేలలేదు. 
కానీ చంద్రబాబు హైదరాబాదుకు తిరిగివచ్చిన తర్వాత మాత్రం హైడ్రామా నడిచింది. సెక్షన్‌ 8 అమలు కాబోతున్నదని అర్థం వచ్చేలా తెలుగుదేశం నాయకులు మాట్లాడడం చర్చనీయాంశం అయింది. దానికి తోడు వారు తమ పోలీసుల్ని కూడా మోహరించుకున్నారు. మరోవైపు ఢల్లీిలో హోంమంత్రి రాజ్‌నాధ్‌ సింగ్‌ ఈ వ్యవహారంపై మాట్లాడుతూ.. ‘తానేమీ కామెంట్‌ చేయనని.. ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాన్ని గురించి చట్టప్రకారంగా హోం సెక్రటరీ చర్యలు తీసుకుంటారని’ మాత్రమే చెప్పి ఊరుకున్నారు. ఆ తర్వాత.. హోం జాయింట్‌ సెక్రటరీ హైదరాబాదు రాబోతున్నట్లు వార్తలు వచ్చాయి. 


అయితే అవన్నీ ఉత్తపుకార్లేనని బుధవారం తేలిపోయింది. అసలు జాయింట్‌సెక్రటరీ అలోక్‌కుమార్‌.. బుధవారం ఢల్లీిలోని తన కార్యాలయంలో ఎప్పటిలాగానే పనులు చేసుకున్నారని.. హైదరాబాదు వెళ్లే అంశం కూడా చర్చకు రాలేదని.. ఈ గొడవల గురించి పట్టించుకోనేలేదని ఢల్లీి ప్రతినిధులు మీడియాలో పేర్కొన్నారు. దీంతో.. ఏదో జరిగిపోతున్నట్లుగా వచ్చిన పుకార్లు ఉత్తుత్తివేనని తేలిపోయింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: