గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న నోటుకు ఓటు కేసు ఎన్ని సంచలనాలు సృష్టిందో అందరికీ తెలుగు. ఈ విషయం ఇప్పుడు కేంద్రం దృష్టికి వెళ్లింది ఈ మధ్య ఏర్పడిన కొత్త రాష్ట్రాల మధ్యఇలాంటి చిచ్చు రావడం చాలా దురదృష్ట కరంగా భావిస్తుంది కేంద్రం. ఇప్పుడు ఈ కేసు విషయం టెలిఫోన్ ట్యాపింగ్ పై పడింది ఇరు రాష్ట్రాలు మీరు తప్పు చేశారు అంటే మీరు తప్పు చేశారు అంటూ ఒకరిపై ఒకరు దూషనల పర్వం కొనసాగిస్తున్నారు.

ఇప్పుడు ఈ టెలిఫోన్ ట్యాపింగ్‌పై ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు వ్యక్తుల మధ్య ఫోన్‌లో కొనసాగుతున్న సంభాషణను ఎక్కడో వేల మైళ్ల దూరంలోని వ్యక్తులు వింటున్నారన్నారు. సికింద్రాబాదులో ఉన్న సైనిక ఇంజినీరింగ్ కాలేజ్‌లోని ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ విభాగానికి సంబంధించిన ఓ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ప్రసంగించిన గవర్నర్ ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని ప్రస్తావించారు. టెక్నాలజీ ఉంది కదా అని ఇష్టాను సారంగా ఉపయోగించడం ఏమాత్రం మంచిది కాదని ఆయన అన్నారు. వ్యక్తిగత స్వేచ్ఛను పరిరక్షించేలా సాంకేతిక పరిజ్ఞానం ఉండాలని కూడా నరసింహన్ చెప్పుకొచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: