తెలంగాణలో టీడీపీ ప్రాబల్యం చాటాలనుకున్న చంద్రబాబు ఇప్పుడు పెద్ద చిక్కుల్లో పడ్డాడు. తెలంగాణలో చంద్రబాబుకు నమ్మిన బంటుగా వ్యవహరించే ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో అనూహ్యంగా ఏసీబి వలలో చిక్కుకున్నాడు. ఇప్పుడు ఆ కేసు తిప్పి తిప్పి చంద్రబాబు మెడకు చుట్టుకుంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు..? అయితే ఓటుకు నోటు వ్యవహారంలో తనతో చంద్రబాబు మాట్లాడినట్లు నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ అంటున్నాడు. అది అవాస్తవమని ఏపీ సర్కార్ అంటుంది పైగా తెలంగాణ ప్రభుత్వం తమ ఫోన్ ట్యాపింగ్ చేయడం అన్యాయమని ఇది నేరం కిందికి వస్తుందని వారో ఆరోపిస్తున్నారు.

తాజాగా ఓటుకు నోటు కేసులో ఎఫ్‌ఎస్‌ఎల్(ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరి) ప్రాథమిక నివేదిక ఏసీబీ కోర్టుకు చేరింది. ఈ కేసుకు సంబంధించి ఆడియో, వీడియో రికార్డులను ఎఫ్‌ఎస్‌ఎల్ నిశితంగా పరిశీలించిన విషయం విదితమే. రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, మత్తయ్య తదితరులు మాట్లాడిన 14 ఆడియో, విడియో టేపులను ల్యాబ్ కు పంపారు. వాస్తవానికి ఇవి ఎలాంటి ట్యాపింగ్ చేసినవి కావని ఫోన్ లో రికార్డు అయినవే అని ఫోరెన్సిక్ విశ్లేషణలో తేటతెల్లమైనట్లు ఆ వర్గాలు పేర్కొన్నట్టు సమాచారం.

ఈ కేసులో రేవంత్ రెడ్డి, స్టీఫెన్ సన్ మధ్య జరిగిన సంభాషణలు, స్టీఫెన్ సన్ ఇంట్లో రికార్డయిన దృశ్యాలు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్టీఫెన్ సన్‌తో మాట్లాడిన ఆడియో, వీడియో టేపులకు సంబంధించిన వివరాలను పొందుపరచినట్లు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే చంద్రబాబుకు రేపోమాపో ఏసీబీ నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని సమాచారం..?


మరింత సమాచారం తెలుసుకోండి: