ఓటుకు కోట్లు కేసు విషయం ఏమైంది.. సంచలనాలకు కారణమవుతుందనుకున్న కేసులో వారం రోజుల  నుంచి స్తబ్దత నెలకొంది. ఇదిగో నోటీసులు.. అదిగో అరెస్టులు.. అని పాపం కొన్ని ఛానళ్లు, పేపర్లు ఎంత మొత్తుకున్నా దర్యాప్తులో చెప్పుకోదగ్గ ముందడుగు పడలేదు. సంచలనాల నమోదు అంతకన్నా లేదు. మొన్నటికి మొన్న టీ న్యూస్ కు నోటీసులిచ్చే విషయంలో ఏపీ పోలీసుల హడావిడి తర్వాత చెప్పుకోదగిన వార్తలు ఈ విషయంలో లేవు.

కానీ ఇప్పుడు కేసు దర్యాప్తు దూకుడు పెరుగుతుందన్న వాదన వినిపిస్తుంది. ఇన్నాళ్లూ ఫోరెన్సిక్ నివేదిక కోసం ఎదురు చూసిన తెలంగాణ ఏసీబీ ఇక జూలు విదులుస్తుందని చంద్రబాబు వ్యతిరేకులు ఆశలు పెట్టుకున్నారు. మొత్తం మీద ఫోరెన్సిక్ లాబ్ నివేదిక తెలంగాణ ఏసీబీ చేతికి చేరింది. ఈ నివేదికను క్షుణ్ణంగా అధ్యయనం చేసి.. అందులో లా పాయింట్లు వెదికి తదుపరి చర్యలకు ప్లాన్ చేయాల్సి ఉంటుంది. 

ఒకటి రెండు రోజుల్లో సంచలనాలు.. 

Image result for telangana acb
ఫోరెన్సిక్ నివేదిక చేతికి అందిన దగ్గర నుంచి తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులు, దర్యాప్తు అధికారులు భేటీలపై భేటీలు అయ్యారు. భవిష్యత్తు కార్యక్రమంపై అర్థరాత్రి వరకూ చర్చలు జరిపారట. దీన్ని బట్టి రానున్న రెండుమూడు రోజుల్లో సంచలనాలు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫోరెన్సిక్ నివేదికలోని అంశాలను విశ్లేషించేందుకు ఏసీబీ మూడు ప్రత్యేక సాంకేతిక నిపుణుల బృందాలను ఏర్పాటు చేసిందట. 

ఈ కేసులో పెద్ద తలకాయలు ఉన్నందువల్ల తొందర పడకూడదని అంతా పక్కాగా పకడ్బందీగా ఉండాలన్న జాగ్రత్తతోనే చంద్రబాబుకు నోటీసుల జారీ ఆలస్యమవుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరో వైపు.. వ్యవహారం అంతా ఢిల్లీ స్థాయిలోనే సెటిల్ అయ్యిందని.. ఇక విచారణ నామమాత్రంగానే ఉంటుందన్న వాదన కూడా వినిపిస్తోంది. తెలంగాణ ఏసీబీ రెండు, మూడు రోజుల్లో తీసుకునే చర్యలను బట్టి ఈ విషయంపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: