భారత దేశంలో అత్యంగ విశాదకరమైన సంఘటనలు ఎమర్జెన్సీల కాలంలో జరిగాయి. ఆ జ్ఞాపకాల్ని తలుచుకుంటే ఇప్పటికీ ఒల్లు జలదరిస్తుంది అంటారు ఆప్పటి బాధితులు.  తమిళ నాడు మాజీ సీఎం కరుణానిధి కుమారుడు స్టాలిన్ క్రియాశీలక రాజకీయాల్లో పాల్గొంటారు. ఈయన 1975 ఎమర్జెన్సీ రోజులను గుర్తు చేసుకున్నారు. అప్పట్లో డీఎంకే అంటే అందరికీ చేరువ అవుతున్న పార్టీ ఇది గిట్టని ప్రభుత్వం 120 మంది నాయకులను చెన్నై సెంట్రల్ జైళ్లో వేశారు అందులో నేనూ ఒకన్ని.

ఎమర్జెన్సీ కాలంలో ధర్నాలు, ఉద్యమాలు


సంవత్సర కాలం పాటు ఆ జైళ్లో ఉంచారని మూడు నెలలు మాత్రం నరకం చూపించారని చెప్పారు. అక్కడి అధికారులు జీవిత ఖైదీలచేత తమను రోజూ కొట్టించే వారని ఆ దెబ్బలకు తన చేతిపై గాయం అయ్యిందని ఆ గాయం ఇప్పటికీ ఉందని చెప్పారు. అంతే కాదు తమ మాట వినని వాళ్లను చంపడానికైనా తయారయ్యేవారని చెప్పాడు. ఆ సమయంలో  ఆ దెబ్బల నుంచి మా పార్టీ ఎంపీ చిట్టిబాబు తమను తప్పించి ఎక్కువ దెబ్బలు ఆయన తినేవార ని ఆ తర్వాత ఆ దెబ్బలతోనే ఆయన మృతి చెందారని కన్నీళ్లు పెట్టుకున్నారు. మొత్తానికి ఎమర్జెన్సీ కాలం ఓ  పీడకల అని స్టాలిన్ అన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: