తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కొత్త బస్సు ఎక్కబోతున్నారు.. ఇది సామాన్యమైన బస్సు కాదు హైటె హంగులతో ఫుల్ సెక్యూరిటీతో ప్రత్యేకంగా ఆయన కోసం ఏర్పాటు చేసిన బస్సు. రాష్ట్ర ముఖ్యమంత్రి పలు సంక్షేమ కార్యక్రమాల అమలు లో భాగంగా ఆయన పర్యటించడానికి సెక్యూరిటీ కోసం ఏర్పాటు చేసిన బస్సు. ఈ బస్సు గురువారం రాత్రి మియాపూర్ డిపోకు చేరుకుంది. బస్సు వెలుపల, బయట తుదిమెరుగులు దిద్దుకుంటున్నది.

అత్యాధునికమైన బస్సు ఇదే...


మొత్తం బుల్లెట్‌ ప్రూఫ్‌తో కూడిన ఈ బస్సును దాదాపు నాలుగు నెలల పాటు శ్రమించి తయారు చేశారు. ఇందులో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి,  సిఎం విశ్రాంతి కోసం బెడ్‌ తో పాటు అత్యవసరంగా 15 మంది కూచొని మాట్లాడుకునే విధంగా సీట్లను అమర్చారు. అత్యవసరంగా అన్ని జిల్లాల ఎస్‌పిలు, కలెక్టర్లతో పాటు మంత్రులతో మాట్లాడటానికి వీడియో కాన్ఫరెన్స్‌ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. శత్రువుల నుంచి రక్షణ కోసం ఆధునిక సెల్‌ జామర్‌ను కూడా ఇందులో ఏర్పాటు చేశారు.

తెలంగాణ  సీఎం కేసీఆర్


ఒకవేళ సీఎం ప్రజలతో మీటీంగ్ పెట్టినా వారితో మాట్లాడాలన్నా అందుకు  విలుగా ఆధునిక మైక్‌ సిస్టమ్‌తో పబ్లిక్‌ అడ్రెస్‌ సిస్టమ్‌ను కూడా ఏర్పాటు చేశారు. దీని ఖరీదు దాదాపు ఆరు కోట్లు.
అయితే సీఎం కొన్న ఈ బస్సుపై జాతీయమీడియాలో పలు విమర్శనాత్మక కథనాలు వెలువడుతున్నాయి. ఇవాళ ఉదయం యాదగిరిగుట్టలో కొత్త బస్సుకు పూజలు చేశారు. అత్యంత ఖరీదైన బస్సును కొనుగోలు చేసినట్లు  టైమ్స్ నౌ, సిఎన్ఎన్ - ఐబిఎన్ తదితర ఛానల్స్ లోనూ కథనాలు వేసారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: