తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఆధ్యాత్మిక భావనలు, ఆచారాలు ఎక్కువే. ఆయన తెలంగాణ ఉద్యమ సమయంలోనూ వీటికి ప్రాధాన్యమిచ్చారు. తెలంగాణ సాకారం కోసమంటూ అప్పట్లో యజ్ఞాలు, యాగాలు కూడా చేసిన చరిత్ర ఉంది. పండితులకు, సిద్ధాంతులకు ఆయన బాగానే ప్రాధాన్యమిస్తారు. 

మొన్నటికి మొన్న యాదగిరిగుట్ట అభివృద్ధి విషయంలోనూ కేసీఆర్ చినజీయర్ స్వామి వంటి వారికి బాగా ఇంపార్టెన్స్ఇచ్చారు. కేసీఆర్ కు దేవుళ్ల మొక్కుల పట్టింపులు కూడా ఎక్కువే.  తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యాక.. ఆయన రాష్ట్రం కావాలన్న తన మొక్కులను సర్కారు సొమ్ముతో తీర్చుకోవడం కూడా అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది. ఎవరేమనుకున్నా డోంట్ కేర్ అంటూ ఆయన తన మొక్కులకు నిధులు విడుదల చేయించుకున్నారు. 

కేసీఆర్ భార్య కూడా తెలంగాణ కోసమే మొక్కారు..


తన మొక్కులన్నీ తీర్చేసుకున్న కేసీఆర్ ఇప్పుడు తన భార్య మొక్కులపై దృష్టి సారించారు. ఆయన తన సతీమణి శోభ మొక్కును త్వరలోనే తీరుస్తారట. ఈ విషయం ఆయనే స్వయంగా వెల్లడించారు. అది కూడా ప్రభుత్వ ఖర్చుతో కాకుండా తన సొంత ఖర్చుతో తీరుస్తారట. 

కేసీఆర్ భార్య శోభ కూడా  భర్తలాగానే.. తన సొంతానికి మొక్కుకోలేదు. ఆమె కూడా తెలంగాణ రావాలన్న కోరిక కోసమే మొక్కారు. తెలంగాణ వస్తే కాళేశ్వర స్వామికి కిరీటం చేయిస్తానని శోభ మొక్కుకున్నానని చెప్పిందని.... ఆ మొక్కు తీర్చుతానని కేసీఆర్ సిద్దిపేట పర్యటనలో చెప్పారు. పనిలో పనిగా ఆయన సిద్ధిపేటకు పలు వరాలు ప్రకటించారు. త్వరలోనే సిద్ధిపేట జిల్లా అవుతుందని.. త్వరలోనే సిద్దిపేటకు రైలు వస్తుందని భరోసా ఇచ్చారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: