తెలుగు ప్రజల గుండెల్లో సుస్థర స్థానాన్ని పొందిన మహనీయుడు స్వర్గీయ వైఎస్. రాజశేఖర్ రెడ్డి. ఈయన జయంతి నేడు ... యెడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి 1949, జూలై 8న వైఎస్ఆర్ జిల్లాలోని పులివెందులలో జన్మించాడు.ఆంధ్ర ప్రదేశ్ 16వ ముఖ్యమంత్రి పని చేసి రెండు సార్లు అద్భుత మెజార్టీతో గెలిచారు. ఆయన పోటీచేసిన ప్రతి ఎన్నికలలోనూ విజయం సాధించారు . జనతాపార్టీ ప్రభంజనాన్ని తట్టుకొని విజయం సాధించిన తొలి ఎన్నికల (1978) వెంటనే మంత్రిపదవి పొందాడు.

కుటుంబ సభ్యులతో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి

Image result for ys rajasekhar family

ప్రాంతాలకతీతంగా ప్రజాసంక్షేమమే ధ్యేయంగా పాలన సాగించి ప్రజల అభిమానాన్ని చూరగొన్నారన్నారు. వైఎస్సార్ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన ప్రజలు నేటికీ ఆయన పాలనను మరువలేకపోతున్నారన్నారు.

రాష్ట్రంలో పేద, మధ్యతరగతి, బడుగు, బలహీన వర్గాలు, రైతుల అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలు ప్రవే శపెట్టి విజయవంతంగా అమలు చేసిన ఘనత వైఎస్సార్‌కు దక్కుతుందని ఆ పార్టీ శ్రేణులు కొనియాడారు. తెలుగు రాష్ట్రాల్లో జిల్లాలోని అన్ని మండలాలు, గ్రామాలలో వైఎస్సార్ జయంతిని ఘనంగా నిర్వహించడంతో పాటు వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టాలని వైఎస్సార్ సీపీ పిలుపునిచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: