ఒకప్పుడు మనిషికి 50 ఏళ్లు పైన దాటినా కూడా బలిష్టంగానే ఉండేవారు... చక్కగా నడవడం,చలాకీగా పని చేసుకోవడం లాంటివి చేసేవారు. కానీ నేటి ఆధునిక కాలంలో ముప్పయి సంవత్సరాలు పడ్డాయో అంతే రక రకాల రోగాలు మనిషిని చుట్టు ముడుతున్నాయి. ఇక వృద్ధాప్యం వచ్చిందంటే కీళ్ళ నొప్పులు కూడా ప్రారంభమైనట్లే. ఎముకలు గట్టిపడి అవి కీళ్ళు బిగదీసుకుపోవడానికి కారణమవుతుంటాయి. ఏదో విధంగా కీళ్ళకు దెబ్బ తగలడం వల్లగాని, ఏవైనా క్రిముల వల్ల ఇన్‌ఫెక్షన్‌ రావడం వల్లగాని కీళ్ళ వ్యాధి రాగల అవకాశముంది.  

మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు..!


కీళ్ళు ఉన్న ప్రాంతంలో కందిపోయినట్లుగా ఉండటం, వాచినట్లుగా ఉండి, వేడిగా ఉన్న ట్లు అనిపించడం, రోగికి నీరసం, తలనొప్పి, ఆకలి లేకపోవడం, జ్వరం లాంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.

కీళ్ళ మీద ఆవనూనెను ప్రతిరోజూ రెండు పూట లా మర్దన చేయాలి. ఆ తర్వాత సైంధవ లవణం ఒక స్పూను, దానిమ్మ చిగుళ్ళు కొంచెం కలిపి నూరి, శనగగింజంత మాత్రలుగా చేసుకుని ఒక మాత్ర చొప్పున మూడు పూటలా తీసుకుంటే కీళ్ళ వ్యాధులు తగ్గిపోతాయి.

ఉల్లిపాయ, ఆవాలు సమ భాగాలుగా తీసు కుని బాగా నూరి నొప్పిగా ఉన్న కీళ్ళమీద మర్దన చేసుకుంటే వెంటనే నొప్పులు తగ్గుతాయి. నువ్వుల నూనె ఒక కప్పు, నాలుగు వెల్లుల్లిపాయ రేకల్ని చిన్న ముక్కలుగా చేసి నూనెలో వేసి బాగా మరగకాచి, చల్లార్చి ఆ నూనెను వడగట్టి కీళ్ళ నొప్పులున్నచోట మర్దన చేస్తే కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. ఇలా మర్దన చేయడం వల్ల కొందరికి కీళ్ళ నొప్పులు తగ్గకుండా నొక్కడం వల్ల ఇంకా బాధ పెరుగుతుంది. ఇటువంటి వారు నూనెను రాసుకుని కాపడం పెడితే చాలు. కీళ్ళు స్వాధీనంలోకి వచ్చాక మర్దన చేసుకోవచ్చు. జీల్లేడు వేరు చూర్ణాన్ని వేప నూనెలో బాగా కలిపి మర్దన చేసుకున్నట్లయితే కీళ్ళ నొప్పులు తగ్గిపోతాయి.

మిరియాలు ఒక స్పూను, విషముష్టి గింజలు ఒక స్పూను ఈ రెండింటినీ అల్లం రసంలో మూడు రోజుల పాటు నాన బెట్టి, ఆ తర్వాత మెత్తగా మర్దన చేసి చిన్న చిన్న కంది గింజలంత మాత్రలు చేసు కుని ప్రతిరోజూ రెండు పూటలా ఒక మాత్ర చొప్పున వేసుకుంటే అనేక రకాల కీళ్ళ వ్యాధులు తగ్గిపోతాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: