మనస్తాపంతో ఓ మహిళా కండెక్టర్ బస్సులోంచి దూకి తీవ్రగాయాలపాలై మృతి చెందిన సంఘటన అందరిని కలిచి వేసింది.  వివరాల్లోకి వెళితే... శుక్రవారం ఉదయం పట్టిసీమ ఎల్ఎన్‌డీ కాలనీలో ఆర్టీసీ అధికారులు జంగారెడ్డిగూడెం నుంచి పట్టిసీమకు వెళ్తున్న బస్సును ఆపి తనిఖీ చేశారు..  టిక్కెట్ల కంటే ఎక్కువ మంది ఉండటంతో మహిళా కండెక్టర్ పద్మావతిని పిలిచి మందలించారు అంతే కాదు రిమార్క్ కూడా రాశారు. దాంతో పద్మావతి మనస్తాపానికి గురై నడుస్తున్న బస్ నుంచి దూకేశారు.

అనుకోకుండా జరిగిన ఈ సంఘటనతో అందరూ అప్రమత్తమై ఆమెను రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినారు కానీ అప్పటికే ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో ఆమె చికిత్స పొందుతూ మరణించింది. ఉద్యోగంలో రిమార్కులు అనేవి సహజం తర్వాతనైనా సర్దుకోవచ్చు కానీ ప్రాణాలు పోగొట్టుకుంటే తిరిగి రావు కదా అని ఆమె బంధువులు బాధపడుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: