నేటి రాజకీయాల్లో కులం పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్నికల్లో సీట్ల కేటాయింపుల దగ్గర నుంచి.. మంత్రివర్గం బెర్తులు కేటాయింపు వరకూ దీని పాత్ర ఎంతో. ప్రతిభావంతులు ఒకే కులంవారు ఎక్కువ ఉన్నా.. వారి కులం కారణంగా కొందరికే అవకాశాలు దక్కుతాయి. మరికొందరు తమ కులంలో ఇతర నేతలు లేని కారణంగా అవసరానికి మించిన ప్రాధాన్యం పొందుతారు. 

ఇలాంటి కులంపై కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో కులానికి అనవసరమైన ప్రాధాన్యత పెరుగుతోందని వెంకయ్య కామెంట్ చేసారు. చాలామంది నాయకులు తరచూ కులగజ్జి అంటూ కామెంట్లు చేస్తారని వాస్తవానికి అది కులగజ్జి కాదని కుర్చీగజ్జి అని వెంకయ్య అన్నారు. కులం, ధనం, మతం సమాజాన్ని శాసిస్తున్నాయని చెప్పారు. ఇవి రాజకీయాల్లోకి ప్రవేశిస్తే చాలా ప్రమాదకరమన్నారు వెంకయ్య.  

కులం మనుషులను విడదీస్తుంది: వెంకయ్య


కులం మనుషులను విడదీస్తుందని.. మానవత్వం మాత్రమే మనుషులను కలుపుతుందని వెంకయ్య అన్నారు. కుల వ్యవస్థ మధ్యలో వచ్చిందని.. అది కేవలం గుణాలను బట్టి కాక వృత్తుల ఆధారంగా ఏర్పడిందని వెంకయ్య అన్నారు. కులానికి శాస్త్రీయమైన ప్రాతిపదిక లేదని.. అసలు కులాన్నిపట్టించుకోవాల్సిన అవసరమే లేదని వెంకయ్య.. గుంటూరు జిల్లాలోని నాగార్జున విశ్వవిద్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో అన్నారు. 

ముళ్లపూడి హరిచంద్ర ప్రసాద్ అంతర్జాతీయ వాణిజ్య సంస్థ నూతన భవనం నిర్మాణానికి వెంకయ్యనాయుడు శంకుస్థాపన చేశారు. పారిశ్రామిక రంగంలో ముళ్లపూడి హరిచంద్ర ప్రసాద్ చేసిన సేవలను ఆయన కొనియాడారు. రాకెట్ ప్రయోగానికి అవసరమైన ఇంధనాన్ని ఆంధ్రా షుగర్స్ సంస్థ తయారు చేయడం మన దేశానికే గర్వ కారణమన్నారు. ప్రపంచంలో రాకెట్ ఇంధనం తయారు చేసేవి 5 దేశాలు ఉంటే అందులో మన భారతదేశం పేరు ఉండటానికి కారణం ముళ్లపూడి హరిచంద్ర అని ప్రశంసించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: