తెలుగు చలన చిత్ర సీమలో ఎనభైవ దశకంలో అగ్ర హీరోల సరసన నటించి మెప్పించిన హీరోయిన్ విజయశాంతి అలియాస్ రాములమ్మ. దాసరి నారాయణ రావు నిర్మించి  ఒసేయ్ రాములమ్మ సినిమాతో రాములమ్మగా పేరొచ్చింది. అయితే తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ తో కలిసిన టీఆర్ఎస్ లో పనిచేసింది విజయశాంతి.  కానీ రాజకీయాల్లోకి మటుకు బీజేపీ ద్వారానే వచ్చింది.  కేసీఆర్ ఉద్యమ స్ఫూర్తితో టీఆర్ఎస్ లో చేరి క్రియాశీలక పాత్ర పోషించింది.

ఎపీగా ఉన్నపుడు కేసీఆర్ తో విజయశాంతి


తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ తో విభేదాలు వచ్చి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొని ఎలక్షన్ లో నిలబడి ఓడిపోయింది. అప్పటి నుంచి ఆమె రాజకీయాలకు కాస్తా దూరంగానే ఉంటున్నారు. కాంగ్రెస్‌లో దూకిన విజయశాంతికి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది.  దీంతో విజయశాంతి మళ్లీ గులాబీ పార్టీ వైపు చూస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఇందులో భాగంగా తెలంగాణ సీఎం, అన్నయ్య కేసీఆర్ సిగ్నల్ కోసం విజయశాంతి ఎదురుచూస్తోందని తెలిసింది.

కేసీఆర్ కి రాఖీ కడుతున్న విజయశాంతి


రాములమ్మ టీఆర్ఎస్‌లోకి చేరాక మరికొందరు రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే టీఆర్ఎస్ అగ్రనాయకత్వంతో విజయశాంతి సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: