తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయిన తర్వాత ఇరు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రాబల్యం పూర్తిగా తగ్గిపోయింది.  తెలంగాణ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధి చొరవతోనే  వచ్చిందన్న గౌరవం ఉంది కానీ మొదటి నుంచి తెలంగాణా కోసం పోరాడుతున్న కేసీఆర్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు తెలంగాణ వాసులు. ఇక వద్దంటే రాష్ట్రాన్ని విడగొడతారా అంటూ సీమాంధ్ర కాంగ్రెస్ ను బహిష్కరించింది.

ఎఐసిసి ఉపాద్యక్షుడు రాహుల్ గాందీ


రెండు రాష్ట్రాలో కాంగ్రెస్ పూర్తింగా బలహీన పడింది. దీనికి ఉదాహారణే ఆమద్య జరిగిన సార్వత్రిక ఎన్నికలు. తాజాగా మళ్లీ తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ కూ నూతనోత్తేజాన్ని తీసుకు రావాలాన్న తలంపుతో ఎఐసిసి ఉపాద్యక్షుడు రాహుల్ గాందీ  ఇరు రాష్ట్రాల్లో పాదయాత్రలు మొదలు పెట్టరాు. గతంలో తెలంగాణలో ఆదిలాబాద్ పరిసర ప్రాంతాల్లో పాద యాత్ర చేసి రైతుల కష్టాలు తెలుసుకున్నారు. తాజాగా అనంతపురం జిల్లాలో పాదయాత్రకు విచ్చేశారు.అనంతపురం కొడికొండ చెక్ పోస్ట్ కు చేరుకున్న రాహుల్ గాంధీకి ఏపి కాంగ్రెస్ నాయకులు భారీ స్వాగతం పలికారు.

ఇక రాహుల్ పర్యటనను నిరసిస్తు టిడిపి నాయకులు ఆందోళన చేసే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని అక్కడి నుండి తరలించారు.ఓబుళదేవర చెరువు వద్ద బహిరంగ సభలో ప్రసంగంతో అనంతరం రాహుల్ గాంధీ పది కిలోమీటర్ల పాదయాత్ర మొదలవుతుంది. రైతుల కష్టాలు తెలుసుకోని వారి బాదలను ప్రభుత్వ దృష్టికి తీసుకు వెళ్లడానికి రాహుల్ పర్యటన ముఖ్య ఉద్దేశ్యమని కాంగ్రెస్ వర్గీయులు అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: