రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ముమ్మాటికి రైతు వ్యతిరేక ప్రభుత్వేమేనని సీపిఐ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయం, రైతాంగం పట్ల అనుసరిస్తున్న విధానాల వల్లనే నేడు రుణాలు, విత్తనాలు , ఎరువులు అందక పోవడంతో రైతులు తల్లడిల్లిపోతున్నారని, పైగా ఈ ప్రభుత్వం కరువుపై ఏమాత్రం స్పందించటం లేదని ఆయన విమర్శించారు. ఇది రైతు సంక్షేమ ప్రభుత్వం అని చెబుతున్న వాళ్లు పారిశ్రామికాభివృద్ధి పేరుతో రైతుల నుంచి భూములను లాక్కొని వారిని వీధిన పడేస్తున్నారని నారాయణ ధ్వజమెత్తారు. ఇప్పటికే రైతులకు అండగా నిలిచి అనేక రైతాంగ పోరాటాలలో ప్రధాన పాత్ర పోషిస్తున్న ఆంద్రప్రదేశ్ రైతు సంఘం భవిష్యత్తులో కూడా రైతుల పక్షాన నిలిచి బలమైన ఉద్యమాలను నిర్మించాలని సిపిఐ కార్యదర్శి కోరారు. ఇప్పటికీ సోంపేట, కాకర్లపల్లి, వ్యాన్పిక్, ఎమ్మార్ ప్రాపర్టీస్ భూ పోరాటంలో సిపిఐ ప్రధాన పాత్ర వహిస్తుందని, సిపిఐ మూడు రోజులుగా నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి శిక్షణా శిభిరం ముగింపు కార్యక్రమంలో శనివారం నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘‘సమకాలీన రాజకీయ పరిస్థితులు¬ సిపిఐ విధానం’’ అనే అంశంపై ప్రసంగించారు. ఒకవైపు అవినీతి ప్రజా వ్యతిరేక విధానాలలో కూరుకుపోయిన యుపిఏ కూటమి మరోవైపు మతతత్వ బిజెపి నేతృత్వంలోని ఎన్డడిఎ  కూటమి రాష్ట్రపతి ఎన్నికను పావుగావాడానికి ప్రయత్నిస్తున్నాయని నారయణ పేర్కొన్నారు. కాంగ్రెస్, బిజెపి కూటములు  మద్దతునిస్తున్న, అభ్యర్థులు బరిలో ఉన్న కారణంగా సిపిఐ స్వతంత్ర పంథాను ఎంచుకొని రాష్ట్రపతి ఎన్నిక నుంచి దూరంగా ఉండాలనే వైఖరని  కొనసాగిస్తుందని వివరించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలను నారాయణ ఎండకట్టారు. కేంద్రంలోని కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వం పెద్ద ఎత్తున అవినీతి కుంభకోణంలో కూరుకుపోయిందని, అయిన ఫైనాన్స్ క్యాపిటల్ను విచ్చలవిడిగా ప్రవేశపెట్టి ఆ నిధినంతా అనుత్పాదక రంగాలలో పెడుతుందని దానివల్ల వస్తు ఉత్పత్తి గణనీయంగా పడిపోతుందని చెప్పారు. అమెరికా, ప్రపపంచ బ్యాంక్ చెప్పిన మాటను కాదనకుండా అమలు చేయడానికి కేంద్రప్రభుత్వం ప్రయత్నిస్తుందని ధ్వజమెత్తారు. ఇక బిజెపి గమనిస్తే 2014 ెఎన్నికల తర్వాత అవినీతి రహిత  పాలన అందిస్తామని హామీలు ఇస్తూ కాంగ్రెస్ను విమర్శిస్తుందని, కానీ కానీ కర్నాటకలో బిజెపి ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుపోయిన దానిపై ఆ పార్టీ దేశ ప్రజలకు ఏమి సమాదానం చెబుతుందని సిపిఐ నాయకులు ప్రశ్నించారు. వచ్చే 2014 ఎన్నికల్లో ఆవే ప్రత్నామ్నాయం అని, సుస్థిర, అవినీతి రహిత పరిపాలనను అందించే విషయమై కాంగ్రెస్, బిజెపిలలో ఏ ఒక్కరు కూడా ప్రజలకు విశ్వాసం కలిగించే పరిస్థితిలో లేరని గుర్తు చేశారు. ఈ నేపధ్యంలో జరుగుతున్న రాష్ట్రపతి ఎన్నికల్లో దేశ ప్రయోజనాలు కాకుండా ఆయా పార్టీలు ప్రాంతాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వ్యవహరిస్తుందన్నాయని ఒక్క సిపిఐ మాత్రమే స్వతంత్ర నిర్ణయం తీసుకుందని అన్నారు. ఒక పార్టీ, ఒక ప్రాంతం అనుసరించి రాజకీయాలు చేయరాదని, దేశం, ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవాలని అభిప్రాయబడ్డారు. కానీ ఇంతవరకు టిఆర్ఎస్, టిడిపి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరికీ మద్దతు ఇవ్వాలనే దానిపై తేల్చుకోలేకపోతున్నాయని, ఒకరివైపు ఒకరు చూసుకుంటున్నాయని, ఇప్పటికే అవినీతిపై కాంగ్రెస్ స్ఫష్టత లేదని ఆయన తెలిపారు. అయితే రాజకీయాలలో అందరూ అవినీతిపరులనే విధానం కూడా సరైంది కాదని, అవినీతికి వ్యతిరేకంగా నిలబడి పోరుతున్న వారిని గుర్తించాలని నారాయణ కోరారు. గత వైఎస్ ప్రభుత్వ హాయాంలో చేసిన పాపాలు కాంగ్రెస్ కే అంటుకున్నాయని, కానీ ఆయన కొడుకుకు మాత్రం లాభాలు అందాయని వివరించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో రిలయన్స్ వంటి కార్పొరేట్ సంస్థ పాత్ర కూడా ఉందని, కొన్ని పార్టీలను యుపే వైపు మొగ్గుచూపడం వెనుక రిలయన్స్ పాత్ర ఉందని నారాయణ చెప్పారు. ముగింపు కార్యక్రమంలో ఆంద్రపదేశ్ రైతు సంఘం కార్యనిర్వాహక అధ్య క్షులు కె.రామకృష్ణ, అధ్యక్షురాలు పశ్య పద్మ, ప్రధానకార్యదర్శి రావుల వెంకయ్యతో పాటు అఖిల బారత కిసాన్ సభ ఉపాధ్యక్షుల కొల్లి నాగేశ్వరరావు వేదికపై ఆశీనులయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: