అత్యాచారాలకు పాల్పడిన వారిపై ప్రభుత్వం ఎన్ని చట్టాలు తీసుకు వచ్చినా అవి ఏమాత్రం ప్రభావం చూపడం లేదు. సౌదీ దేశాల్లో అత్యాచారం చేసిన వారికి వెంటనే శిక్ష అమలు చేస్తారు. కానీ భారత దేశంలో మటుకు మామూలు శిక్షలు విధించడం వల్ల అత్యాచారం చేసే నింధితుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. నిర్భయ చట్టాలు వచ్చినప్పటికీ అవి అమలు అయ్యే తీరు సరిగా లేక పోవడం వల్లే కామాంధులు మృగాళ్లలా రెచ్చిపోతున్నారు.  

ఇక మన దేశంలో అత్యాచారాలకు అక్రమాలకు ఉత్తర్ ప్రదేశ్ పెట్టింది పేరు. తాజాగా ఇక్కడ మరో దారుణం చోటు చేసుకుంది... రాష్ట్రంలోని మీరట్‌లో ఓ 14 ఏళ్ల బాలికపై నలుగురు యువకులు కదులుతున్న కారులోనే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే... ఖాట్‌కోలి ప్రాంతానికి చెందిన 9వ తరగతి చదువుతున్న బాలిక తన సోదరితో కలిసి బుధవారం ఉదయం పాఠశాలకు వెళ్తుండగా కారులో వచ్చిన నదీమ్‌ అనే యువకుడు స్కూల్‌లో దింపుతామని వారిని కారు ఎక్కించుకున్నాడు. అయితే ఇదివరకే నదీమ్ వారికి పరిచయస్తుడు కావడంతో అమాయకంగా కారు ఎక్కి కూర్చున్నారు. అయితే స్కూల్ రాగానే చెల్లెల్ని దింపేసి అక్కను మాత్రం కారులోనే ఉంచి కొంత దూరం తీసుకు వెళ్లాడు అక్కడ మరో ముగ్గురు మిత్రులతో ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు.

కారులో తిప్పుతూ అతి పైశాచికంగా ఆ అమ్మాయి ఎంత ప్రాదేయ పడ్డా వినకుండా సామూహిక అత్యాచారం చేసి  కర్దౌనీ ప్రాంతంలోని మసూరీ రోడ్‌లో ఆమెను పడేసి పరారయ్యారు. అప్పటికే ఆమె స్పృహ కోల్పోయింది. గమనించిన స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుల కోసం తీవ్రంగా గాలింపు చేపట్టారు. బాలికపై అత్యాచారానికి పాల్పడిన వారిలో ఒకడైన నదీమ్‌ను పోలీసులు గురువారం అరెస్ట్‌ చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: