రాష్ట్రవ్యాప్తంగా రెండవ విడత విద్యాపక్షోత్సవాలు ఈనెల 9వ తేదిన నుండి 20వ తేది వరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనుంది. సోమవారం ఉదయం చిత్తూరు జిల్లా చంద్రగిరిలోని జిల్లా పరిషత్ బాలరు ఉన్నత పాఠశాలలో ముఖ్యమంత్రి ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి ఈ విద్యాపక్షోత్సవాలను ప్రారంభించనున్నారు. బాల, బాలికలంతా వుండాల్సింది నాఠశాలల్లోనే అన్నది విద్యాపక్షోత్సవాల ముఖ్య ఉద్ధేశం. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు ఎంతో ప్రాధాన్యత ఇస్తోంది. గత ఏడాది విద్యాపక్షోత్సవాల సందర్భంగా రూ.3,500 కోట్లతో మౌళిక సదుపాయాలు కల్పించడం జరిగింది. ఈ సంవత్సరం సుమారు 2,348.92 కోట్లతో 12 వేల పాఠశాలల్లో 13,280 అదనపు తరగతి గదులకు శంకుస్థాపనలు, రూ.454 కోట్లతో 355 ఆదర్శ బాలికల వసతి గృహాలుకు శంకుస్థాపన, రూ.34.70 కోట్లతో 54,758 మరుగుదొడ్లను ప్రారంభించడం, రూ.150 కోట్ల వ్యయంతో 500 హైస్కూల్లు కాంప్లేక్సులను ప్రారంభించడం, రూ. 10 కోట్ల వ్యయంతో 108 ఇన్ క్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ కేంద్రాలు ప్రారంభించడం, రూ.10.80 కోట్ల వ్యయంతో పట్టణ ప్రాంతాల డిప్రైన్డ్ పిల్లల కోసం 27 హాస్టల్ భవనాలు ప్రారంభం, రూ. 57.50 కోట్ల వ్యయంతో 46 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల ప్రారంభోత్సవం, రూ.30.30 కోట్లతో 950 ప్రహారీగోడల నిర్మాణాలను ప్రారంభించడం జరుగుతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: