తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర అభివృద్దిలో బాగంగా ఎన్నో సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆ మద్య కాకతీయ మిషన్,స్వచ్చ హైదరాబాద్, హరిత హారం తాజాగా గ్రామీణ జ్యోతి కార్యక్రమాన్ని సోమవారం మండలంలోని జాతీయ ఆదర్శ గ్రామం గంగదేవిపల్లిలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాజమౌళికి ఫోన్ చేశారు..హలో రాజమౌళి అంటే దర్శకులు రాజమౌళి కాదండోయ్..గంగదేవిపల్లి మాజీ సర్పంచ్ గ్రామ అభివృద్ధి కమిటీ నాయకుడు కూసం రాజమౌళికి అన్నమాట.

 తన గ్రామాన్ని అభివృద్ధి బాటలో పరుగులు పెట్టించిన వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గంగదేవిపల్లి గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు కూసం రాజమౌళి సీఎం నుంచి వచ్చిన ఫోన్ చేశారు. అదే రోజు సాయంత్రం ఏడు గంటల సమయంలో స్వయంగా కేసీఆర్, రాజమౌళికి ఫోన్ చేశారు. ‘‘హలో రాజమౌళి గారు…నేను కేసీఆర్ ను మాట్లడుతున్నా. మీ గ్రామంలో గ్రామజ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించి వచ్చాను. ప్రజలు ఏం అనుకుంటున్నారు?’’ అని కేసీఆర్ ఆయనను అడిగారట.   

గంగదేవరపల్లిలో గ్రామజ్యోతి కార్యక్రమంలో మాట్లాడుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్


సీఎం తనకు ఫోన్ చేసి మాట్లాడుతుండటంతో రాజమౌళి కొంత ఆశ్చర్యానికి గురైనా ఆ తర్వాత తేరుకుని ఆయనతో మాట్లాడారు.తాను గంగదేవిపల్లి గ్రామాన్ని సందర్శించడంపై ప్రజల స్పందన ఎలా ఉందని సీఎం కేసీఆర్ రాజమౌళిని అడిగారు. అయితే ‘మీ రాకతో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు.మేం అడిగిన నిధుల కంటే ఎక్కువగా నిధులు మంజూరు చేసినందుకకు మా గ్రామస్తుల ఆనందం మాటల్లో చెప్పలేని విధంగా ఉంది అన్నారు. స్వయంగా ముఖ్య మంత్రి ఫోన్ చేయడం తో ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేసాడు ఈ గ్రామ దర్శకుడు రాజమౌళి. గ్రామాభివృద్ధికి ఏ సహకారం కావాలన్నా ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారని తెలిపాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: