ఢిల్లీలో పెను సంచలనం రేపిన నిర్భయ సామూహిక అత్యాచారం కేసు యావత్ భారత దేశాన్ని కదిలించింది.  16 డిసెంబర్ 2012 న భారత రాజధాని ఢిల్లీ లో ఒక వైద్యవిద్యార్ధినిని కదులుతున్న బస్సులో ఆరుగురు కర్కశంగా, దారుణంగా ఇనుప కడ్డీ తో కొట్టి అత్యాచారం చేశారు. ఆ సంఘటనలో తల మరియు పేగులకు తగిలిన గాయాలతో 13 రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరకు 29 డిసెంబర్ 2012 న ఆమె తుదిశ్వాస విడిచారు.

ఈ కేసులో  బస్సు డ్రైవర్ తో సహా ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనతో దేశవ్యాప్తంగా ప్రజలు నిరసన తెలిపారు. ఢిల్లీ లో వేలమంది నిరసనకారులు తమ నిరసన తెలుపగా ఆ నిరసనలో రక్షకభటులతో ఘర్షణ జరిగింది. ఈ కేసులో ప్రాసిక్యూషన్ 85 మంది సాక్షులను, డిఫెన్స్ 17 మందిని విచారించారు. ఈ కేసులో మరో ముద్దాయి రాంసింగ్ తీహార్ జైల్లో ఉరి వేసుకుని మరణించడంతో కేసు నుంచి తప్పించారు. అయితే మిగిలిన ముద్దాయిలు ముకేశ్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ ఠాకూర్‌ల భవితవ్యాన్ని ఢిల్లీ కోర్టు ఆడిషినల్ సెషన్ జడ్జి యోగేశ్ ఖన్నా మంగళవారం తేల్చనున్నారు.

మహిళలపై అత్యాచారాలు ఆపండి అంటూ నిరసన


ఈ శిక్ష అనుభవిస్తున్న వారిలో వినయ్ వర్మ తనను తోటి ఖైదీలు విపరీతంగా కొడుతున్నారని వారి హింస తట్టుకోలేక పోతున్నానని ఢిల్లీ కోర్టుకు తెలియజేశాడు.తనను కొందరు ఖైదీలు విచక్షణా రహితంగా కొడుతున్నారని కోర్టుకు విన్నవించుకున్నాడు. వాళ్లలా కొట్టినందుకు తన చేయి కూడా ఫ్రాక్చర్ అయిందని అతడు వెల్లడించాడు. నిర్భయ అత్యాచార ఘటనకు పాల్పడిన నలుగురు దోషులకు తీహార్ జైలులో పటిష్ట భద్రత కల్పిస్తున్నారు.  ఇక ఈ ఖైదీలకు నలుగురు దోషులకు కోర్టు మరణశిక్ష విధించిన విషయం తెలిసిందే. 



మరింత సమాచారం తెలుసుకోండి: