తెలుగు రాష్ట్రాల్లో ఇసుక అక్రమ రవానా రోజు రోజుకు పెచ్చు మీరుతుంది. ఆ మద్య ఆంధ్రప్రదేశ్ లో ఇసుక అక్రమరవాణా అడ్డుకున్నందుకు వనజాక్షి అనే తహశీల్దార్ పై టీడీపీ ఎమ్మెల్య అనుచరులు దాడి చేయడం ఈ విషయంపై స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవడంతో సర్దుమణిగింది. ఇక ఇరు రాష్ట్రాల్లో కట్టడాల కోసం ఇసుక అక్రమంగా రావాణ చేయడం దీని వెనుక బడా బాబులు ఉండటంతో గ్రామాల్లో గ్రామస్తులు గట్టిగా నోరు మెదపలేక పోతున్నారు.

తాజాగా మహబూబ్‌నగర్ జిల్లాలో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇసుక మాఫియా వెనుకనున్న నేతలపై కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఆలంపూర్, దేవరకద్ర, కల్వకుర్తిలో అక్రమంగా ఇసుక రవాణా జరుగుతోందని పిటిషన్ దాఖలైంది. పలు చోట్ల ఇసుక తోడకంపై 27 మంది రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ఇక్కడ ఇసుకు ఇష్టాను సారంగా తోడుకొని వెళితే భవిష్యత్ లో భూగర్భ జలాలకు ముప్పు వాటిల్లుతుందని ఇప్పటికే వర్షాలు లేక వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న రైతుల నోట్లో మట్టి కొడుతున్నారి కొంతరు రైతులు వాపోయారు.  


అక్రమంగా ఇసుకను తరలిస్తున్న దృష్యాలు


ఇసుక మాఫియా ఆగడాలకు అడ్డు లేకుండా పోతుందని కొందరు రైతులు ధైర్యం చేసి కోర్టును ఆశ్రయించారు.  రైతులను బెదిరిస్తున్నారని పిటిషనర్ ఆరోపించారు.. విచారణకు మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ విశ్వప్రసాద్ హాజరయ్యారు. కౌంటర్ దాఖలులో ఇసుక మాఫియా పేర్లు లేవంటూ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధితుల వాంగ్మూలాల ఆధారంగా చర్యలు తీసుకోవాలని కోర్టు ఏస్పీకి ఆదేశాలు జారీ చేసింది. కేసులు నమోదు చేశామని మహబూబ్ నగర్ ఎస్పీ పేర్కొన్నారు. పూర్తి వివరాలను కోర్టకు నివేదించాలని ఆదేశించింది.



మరింత సమాచారం తెలుసుకోండి: