కాంగ్రెస్ సీనియర్ నాయకులు మెదక్ జిల్లా నారాయణ ఖేడ్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పటోళ్ల కిష్టా రెడ్డి మంగళవారం ఉదయం కన్నుమూశారు. హైదరాబాదులోని ఎస్సార్ నగర్‌లో గుండెపోటుతో ఆయన నిద్రలోనే మృతి చెందారు. ప్రస్తుతం ఆయన పిఏసి చైర్మన్‌గా ఉన్నారు.  ఆయన వయస్సు 67 సంవత్సరాలు. కిష్టారెడ్డికి భార్య, నలుగురు కుమారులు ఉన్నారు.

నారాయణఖేడ్ మండలం పంచగావ్లో కిష్టారెడ్డి జన్మించారు. కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి అంకిత భావంతో పనిచేసిన కిష్టారెడ్డి రాజకీయ ప్రస్థానం 1989 లో ఎమ్మెల్యేగా అదే సమయంలో టిడి బోర్డు సభ్యుడిగా ఉన్నారు.  గ్రామ సర్పంచ్గా రాజకీయ జీవితం ప్రారంభించిన ఆయన ఎమ్మెల్యేగా ఎదిగారు. ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యేగా 1989, 1999, 2009, 2014లో కిష్టారెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1989 మంచికి మారుపేరుగా నిలిచిన ఆయన ప్రజల అభిమానం చూరగొన్నారు అందుకే నాలుగు సార్లు ఆయనను ఎమ్మెల్యేగా గెలిపించారు.

నారాయణఖేడ్ అభివృద్ది కోసం ఆయన ఎంతగానో పాల్పడ్డారని స్థానికులు చెబుతున్నారు. . ప్రస్తుతం ఆయన తెలంగాణ పీఏసీ ఛైర్మన్గా వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్యే కిష్టారెడ్డి మృతి పట్ల పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. కిష్టారెడ్డి కుటుంబ సభ్యులకు ఉత్తమ్ కుమార్ రెడ్డి సంతాపం తెలిపారు. అభిమానుల సందర్శనార్ధం మృతదేహన్ని ఆయన నియోజకవర్గ కేంద్రమైన నారాయణ‌ఖేడ్‌కు తరలిస్తున్నారు. రేపు అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబసభ్యులు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: