అందమైన ఆడదాన్ని చూస్తే బ్రహ్మకైనా రిమ్మతెగులు పుడుతుందంటారు. ఐతే.. ఈ రిమ్మ తెగులు ఒక్క మగాళ్ల సొంతమే కాదు.. ఆడాళ్లూ అంతే.. అందుకే మన పూర్వీకులు  వివాహబంధంతో ఆడమగాను ఒక్కటి చేసి సంసారం అనే బంధంలో ఇరికించేశారు. కానీ నిజంగా ఈ సెక్స్ సంబంధం జీవిత భాగస్వామికే పరిమితం అవుతుందా.. జీవితాంతం ఒక్కరితోనే సెక్స్ లైఫ్ గడిపేయాలా..

ఈ అసంతృప్తి నుంచి పుట్టిందే అక్రమ సంబంధం. వీటి కారణంగా కూలిన కాపురాలెన్నో.. జరిగిన ఘోరాలు నేరాలు ఎన్నో. ప్రతి అక్రమ సంబంధం వెనుకా ఓ ఆసక్తికరమైన కథనం ఉంటుంది. పక్కింటి అమ్మాయో.. ఎదురింటి ఆంటీయో.. కాలేజీలో స్నేహితురాలు.. ఆఫీసులో కొలీగ్.. ఇలా ప్రతి చోటా ఈ అక్రమ సంబంధాలకు అవకాశం ఉంటుంది. 


పెళ్లైన వాళ్ల మధ్య బయటి సంబధాలు కొన్ని చూపులతోనే ఆగిపోతే.. మరికొన్ని మంచం వరకూ చేరతాయి. కానీ మన భారతీయ  సమాజంలో అక్రమ సంబంధం ఘోరమైన పాపం. ఐతే.. ఫారిన్లో అలా కాదు కదా.. అక్కడ అక్రమ సంబంధాల కోసం పాకులాడే వారిని కలిపే వెబ్ సైట్లు కూడా ఉన్నాయి. ఎంతో చిన్నది జీవితం.. ఒక్కరితోనే సర్దుకుపోతే ఎలా కొత్త సంబంధాలు పెట్టుకోండంటూ ఆ వెబ్ సైట్లు జనాన్ని రెచ్చగొడుతున్నాయి. 

అలాంటి ఓ వెబ్ సైటే.. యాస్లే మాడిసన్. 14 ఏళ్లుగా ఎందరో కుర్రాళ్లు, యువతులు, ఆంటీలు, అంకుళ్ల మధ్య అక్రమ సంబంధాల వేదికగా నిలుస్తోంది. దాదాపు 3 కోట్ల మంది వరకూ ఈ సైట్ లో రిజిస్టర్ అయ్యారట. వారి వివరాలు మాత్రం గోప్యంగా ఉంచుతారు. ఐతే. ఇప్పుడు ఈ వెబ్ సైట్ కొంప ముంచేసింది.. ఈ సైట్ హాక్ అవడంతో వెబ్ సైట్ వినియోగదారులు ఆందోళన చెందుతున్నారట. తమ గుట్టు ఎక్కడ రట్టవుతుందో అని బెంబేలెత్తిపోతున్నారట. అందుకే అంటారు రంకు బొంకూ దాస్తే దాగవని. 


మరింత సమాచారం తెలుసుకోండి: