తెలుగు రాష్ట్రాల్లో ర్యాగింగ్ పంజా విప్పుతుంది.. ఆ మద్య రిషికేశ్వరి అనే బిటెక్ స్టూడెండ్ ఆత్మహత్య రెండు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించింది. ఇప్పుడు ర్యాగింగ్‌కు మరో విద్యార్థి బలయ్యాడు..కాలేజికి ఎన్నో ఉన్నత ఆశయాలతో వచ్చే విద్యార్థులను సీనియర్ విద్యార్థులు తమ ఇష్టానుసారంగా అల్లరి చేయడం హింసిచడం, తాగించడం,డబ్బులు లాక్కోవడం కొన్ని చెప్పరాని పనులు చేయడం వంటివి చేస్తూ జూనియర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.

సున్నితమైన విద్యార్థులు ఇవి తట్టుకోలే చదువు ఆపేయడమో, ఆత్మహత్యలకు పాల్పడటమో జరుగుతుంది. ప్రభుత్వాలు ర్యాగింగ్ నియంత్రణపై ఎన్నో చట్టాలు తీసుకు వస్తున్నా కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యంతో ఈ కల్చర్ ఇంకా కొనసాగుతుంది. మేడ్చల్ లోని సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో ఫస్టియర్ చదువుతున్న విద్యార్థి వరంగల్ వద్ద రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు.ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సాయినాథ్ అనే విద్యార్థి మేడ్చల్ లోని సీఎం కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరంలో చేరాడు. మొదటి నుంచే అతనిపై సీనియర్లు ర్యాగింగ్ చేస్తూ వచ్చారు. తనను వదిలేయాల్సిందిగా అతగాడు చాలాసార్లు వేడుకున్నాడు కూడా! కానీ.. సీనియర్లు తమ పైశాచికానందం పొందడం కోసం అతనిని నిత్యం వేధిస్తూ వచ్చారు.  అతని మృతదేహం వద్ద ప్లీజ్ స్టాప్ ర్యాగింగ్..దీనివల్ల నేనుచనిపోతున్నానంటూ లేఖ లభ్యమయింది.

ర్యాగింగ్ సాంప్రదాయం


హన్మకొండ వడ్డేపల్లి చెరువు వద్ద రైల్వేట్రాక్‌పై విద్యార్థి మృతదేహం లభ్యమయింది. ర్యాగింగ్ కారణంగానే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నానని పేర్కొన్నాడు. ఆ రోజు సీనియర్లు అలా చేసి ఉండకపోతే, తాను ఇలా చేసేవాడినికాదని పేర్కొన్నాడు. సాయినాథ్ మేడ్చల్‌లోని సీఎంఆర్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.  మరో పక్క మాకాలేజీలో ర్యాగింగ్ ఏమీ జరగలేదని యాజమాన్యంచెప్తుంది. హైదరాబాద్ పోలీసులు విచారణ పెట్టారు..ఘటనకు కారకులను కఠినంగా శిక్షించాలని విద్యార్థులు,తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: