తెలుగు రాష్ట్రాలో  ఈ రోజూ, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో  సోమవారం మధ్యాహ్నం నుంచి  కుండపోత వర్షం కురిసింది.ఏపీలో వర్షంతో పాటు పిడుగులు పడ్డాయి. దీంతో, 23 మంది మృతి చెందారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో తండ్రీకొడుకులు, ప్రకాశం జిల్లాల్లో అత్తాకోడళ్లు మృతి చెందారు. పలు ప్రాంతాల్లో హఠాత్తుగా కురిసిన భారీ వర్షం రైతులను ఊరడించగా, ప్రజలను బెంబేలెత్తించింది.

ఉరుములు, మెరుపులు, పిడుగులతో కుండపోతగా కురిసిన వానతో జనం భీతిల్లిపోయారు. ఒడిశా నుంచి కోస్తా జిల్లాల మీదుగా తమిళనాడు వరకు ఆవరించి ఉన్న అల్పపీడన ద్రోణి ఏర్పడింది. బంగాళాఖాతంలో వాయవ్య దిశ నుంచి పశ్చిమ మధ్యభాగం వరకు ఉపరితల ద్రోణి ఏర్పడింది. అక్కడక్కడా పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు చెప్పారు.తెలంగాణలో సోమవారం రాత్రి వరకు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది.  మరోవైపు బంగాళాఖాతంలో వాయవ్య దిశ నుంచి పశ్చిమ మధ్యభాగం వరకు తక్కువ ఎత్తులో ఉపరితల ద్రోణి ఆవరించిఉంది.


భారీ వర్షానికి కూలిన చెట్టు



సోమ, మంగళవారాల్లోనూ అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలపడంతో తగిన జాగ్రత్తలు తీసకుంటున్నారు ప్రభుత్వ అధికారులు. రైతు కళ్లలో ఆనందోత్సాహాలు కనిపిస్తున్నా వర్షాభావం వల్ల ప్రయాణాలకు, ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. నిన్న కురిసిన వర్షానికి ప్రకాశం జిల్లాలో ఆరుగురు, కృష్ణా జిల్లాలో నలుగురు, గుంటూరు జిల్లాలో ముగ్గురు, తూర్పు గోదావరి, అనంతపురం, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున పిడుగుపాటుకు మృతి చెందారు. రాష్ట్రవ్యాప్తంగా పలువురు గాయపడ్డారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: