'ఎన్ని అడ్డదారులు లేదా నిలువు దారులు తొక్కామా అనేది ముఖ్యం కాదు అన్నయ్యా.. అంతిమంగా విజయం సాధించామా లేదా.. అంతే' అనేది ఒక్కటే.. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఎన్నికల వ్యూహం లాగా కనిపిస్తున్నది. బీహార్‌ రాష్ట్రానికి లబ్ధి చేకూర్చే ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదని ఎవ్వరూ అనరు గానీ.. అచ్చంగా ఎన్నికలకు ముందుగా.. బీహార్‌ ప్రజల ఓట్లను ప్రభావితం చేసే విధంగా మోడీ సర్కారు వరాల జల్లు కురిపిస్తుంటే మాత్రం ఎంతో కొంత అనుమానం కలగక మానదు. 


కొన్ని రోజుల కిందట ప్రధాని నరేంద్రమోడీ.. బీహార్‌లో ఓ సభలో మాట్లాడుతూ.. అక్కడి ప్రజలను ఊరించేలా.. ఏకంగా 1..75 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించారు. ఇదంతా ఎన్నికల జిమ్మిక్కులంటూ పాలకపక్షం, ప్రస్తుత ఎన్నికల ప్రత్యర్థి, సీఎం నితీశ్‌కుమార్‌ విమర్శించవచ్చ గాక..! కానీ అంత భారీ ప్యాకేజీ కచ్చితంగా ప్రభావం చూపించేదే. 


అలాగే తాజాగా జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో బీహార్‌లోని బర్హ్‌ విద్యుదుత్పత్తి కేంద్రానికి బొగ్గు అనుసంధానత ఇవ్వాలని మోడీ సర్కార్‌ నిర్ణయించింది. చాలా కాలంగా పెండిగులో ఉన్న ఈ విషయంలో సరిగ్గా బీహార్‌ ఎన్నికల ముందే లెక్కతేలడం విశేషం ఇదేమీ చిన్న సంగతి కాదు. దీనివలన వారికి ఏటా 2000 కోట్ల రూపాయలు ఆదా అవుతాయి. లాభం అదొక్కటే కాదు. ప్రభుత్వం ప్రస్తుతం ఒక యూనిట్‌ కరెంటును రూ.4.15 వంతున కొంటుండగా.. ఇక మీదట బీహార్‌ ప్రభుత్వానికి రూ.2కే అది లభ్యం అవుతుంది. దీని ప్రభావం ప్రజలకు కూడా విద్యుత్తు ధరలు తగ్గాయంటే గనుక.. ప్రతి ఫ్యామిలీకి మోడీ నిర్ణయం వలన ఫలితం ఎంతో కొంత ప్రతినెలా దక్కుతుందన్నమాట. ఇలాంటి సానుకూల అంశాలు ఎన్నికల మీద ఖచ్చితంగా ప్రభావం చూపిస్తాయి. అందుకే మోడీ బీహార్‌ విషయంలో ఎడాపెడా చేతికి ఎముక లేనట్లుగా వ్యవహరిస్తున్నారని పలువురు అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: