తెలంగాణ ఏర్పాటుతో సార్వ‌త్రిక ఎన్నిక‌లు ముగిసిన అనంత‌రం మ‌రోసారి ఎన్నిక‌ల వేడి రాజుకుంది. గ‌త కొన్ని నెల‌లుగా గ్రేట‌ర్ పాల‌క మండ‌లి గ‌డువు ముగిసిన త‌రువాత మ‌ళ్లీ ఎన్నిక‌లు జ‌ర‌ప‌టానికి చాలా స‌మ‌యం తీసుకున్న టీ స‌ర్కార్, రాష్ట్ర ఉన్న‌త న్యాయ‌స్థానం ఆదేశాల మేర‌కు గ్రేట‌ర్ ఎన్నిక‌ల నిర్వ‌హణకు సిద్ద‌మైంది. ఇందుకు ఎన్నిక‌ల సంఘం సైతం అవ‌స‌ర‌మైన క‌స‌రత్తు చేస్తున్న‌ట్లు స‌మాచారం. మ‌రోవైపు ఈ ఏడాది డిసెంబ‌ర్ లో ఈ ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించాల‌ని అధికార పార్టీ ప‌నులను వేగ వంతం చేసింది. ఇక దీంతోపాటు వ‌రంగ‌ల్ పార్ల‌మెంట్ నియోజ‌క వ‌ర్గానికి సైతం ఉప ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ ఎన్నిక‌లకు నేడో రేపో ఉత్త‌ర్వులు వెలువ‌డే అవ‌కాశముంద‌ని అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. వ‌రంగ‌ల్ పార్ల‌మెంట్ స‌భ్యుడి గా ఉన్న క‌డియం శ్రీహరి ముఖ్య‌మంత్రి  కేసీఆర్ మంత్రి వ‌ర్గంలో చేరారు. ఉప ముఖ్య‌మంత్రిగా కొన‌సాగుతున్న క‌డియం ఇటీవ‌ల త‌న పార్ల‌మెంట్ స‌భ్య‌త్వానికి రాజీనామా చేశారు. దీంతో వ‌రంగ‌ల్ మ‌రో సారి వరంగ‌ల్ పార్ల‌మెంట్ స‌భ కు ఉప ఎన్నిల‌కు జ‌ర‌గ‌నున్నాయి. 

చంద్ర‌శేఖ‌ర్ రావు మెద‌క్  పార్లమెంట్ నియోజ‌క వ‌ర్గానికి ఎంపీగా!

   
గ‌త సార్వత్రిక ఎల‌క్ష‌న్ లో గులాభీ ద‌ళ‌ప‌తి కే. చంద్ర‌శేఖ‌ర్ రావు మెద‌క్  పార్లమెంట్ నియోజ‌క వ‌ర్గానికి ఎంపీగా, గ‌జ్వేల్ అసెంబ్లీ నియోజ‌క వ‌ర్గానికి ఎమ్మెల్యే గా పోటిచేసి రెండు స్థానాల్లో భారీ మెజారిటితో గెలిచారు. ఇక టీఆర్ఎస్ శాస‌న‌స‌భ ప‌క్షం కేసీఆర్ ను సీఎం అభ్య‌ర్దిగా ఎక‌గ్రీవ తీర్మానించ‌డంతో, మెద‌క్ పార్ల‌మెంట్ కు రాజీనామా చేశారు. గ‌త సంవ‌త్స‌ర క్రితం జ‌రిగిన మెద‌క్ ఉపఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ అభ్య‌ర్ది కొత్త ప్ర‌భాక‌ర్ రెడ్డి ని భారీ మెజారిటీ తో గెలిపించుకున్నారు గులాబీ ధ‌ళం. ఇక‌పోతే వ‌రంగ‌ల్ ఎంపీగా గెలిచినా క‌డియంను అనుహ్యంగా మంత్రి వ‌ర్గంలోని ఆహ్వానించ‌డంతో ఆయ‌న ఎంపీ సీటు కు రాజీనామా చేశారు. టీఆర్ఎస్ పార్టీలో చోటుచేసుకున్న కొన్ని అనుకొని పరిణామాల‌తో ఉప ముఖ్య‌మంత్రిగా ఉన్న తాటికొండ రాజ‌య్య‌ను మంత్రి వ‌ర్గం సీఎం కేసీఆర్ బ‌ర్త‌ర‌ఫ్ చేసి ఆ స్థానాన్ని ఆదే  సామాజిక వ‌ర్గానికి చెందిన క‌డియం శ్రీహ‌రి తో భ‌ర్తి చేశారు. దీంతో ఆ స్థానానికి ఉపఎన్నిక అనివార్యమైంది.  



ఇవే కాకుండా తెలంగాణ‌లో స్థానిక సంస్థ‌ల కోటా కింద శాస‌న మండ‌లికి ఎన్నిక‌లు జ‌ర‌గాల్సిఉంది. వీటికి సైతం త్వ‌ర‌లోనే ఈసీ నోటిఫికేష‌న్ విడుద‌ల చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. ఈ నేప‌థ్యంలో రాష్ట్రంలో వీలైనంత త్వ‌ర‌గా వ‌రుస‌గా ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. దీంతో రాష్ట్రంలో ఎన్నిక‌ల కొలాహాలానికి తెర‌లేవ‌నుంది. ఇప్ప‌టికే అన్ని రాజ‌కీయ పార్టీలు త‌మ‌వంతు క‌స‌ర‌త్తు కు దిగాయి. ఎన్నిక‌ల‌ను ఎదుర్కొనేందుకు కూడా పార్టీలు స‌మాయ‌త్తమౌతున్నాయి. అన్ని పార్టీల కంటే ఎన్నిక‌ల విష‌య‌లో అధికార టీఆర్ఎస్ పార్టీ దూకుడును ప్ర‌ద‌ర్శిస్తోంది. ఎన్నిక‌లు ఏవైనా గెలుపే ల‌క్ష్యంగా ప‌నిచేయాల‌ని పార్టీ ఆధినేత‌, సీఎం కేసీఆర్ ఇప్ప‌టికే పార్టీ శ్రేణుల‌కు దిశానిర్దేశం చేసిన‌ట్లు స‌మాచారం. వ‌రంగ‌ల్ పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో అన్నింటికంటే ముందుగా జ‌రిగే అవ‌కాశముంద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. దీంతో అధికా టీఆర్ఎస్ తో పాటు ఇత‌ర పార్టీలు సైతం ఈ ఎన్నిక‌ల‌పైనే ప్ర‌ధానంగా దృష్టి సారించాయి. 

టీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నిక‌ల్లో బ‌ల‌మైన అభ్య‌ర్దిని బ‌రిలోకి దింపాల‌ని 


టీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నిక‌ల్లో బ‌ల‌మైన అభ్య‌ర్దిని బ‌రిలోకి దింపాల‌ని భావిస్తోంది. ఇందుకోసం ఇప్ప‌టికే సీఎం కేసీఆర్ జిల్లా నేత‌ల‌తో పాటు పార్టీ ముఖ్యుల‌తో స‌మావేశాన్ని నిర్వ‌హించిన‌ట్లు స‌మ‌చారం. వ‌రంగ‌ల్ నుంచి బ‌రిలోకి దిగేందుకు ప‌లువురు నేత‌లు పోటీ ప‌డుతున్నా..ప్ర‌దానంగా పార్టీకి చెందిన మ‌హిళా నేత‌తో పాటు ఎస్టీ నాయ‌కుడు ముందు వ‌రుస‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది. వీరిని కాద‌ని సీఎం కేసీఆర్ ఆర్ధికంగా బాగా స్థిర‌ప‌డిన వ్య‌క్తితో పాటు ఎన్నిక‌ల్లో ఎలాగైనా విజ‌యం సాధించే వ్య‌క్తి కోసం అన్వేష‌ణ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఒక‌వైపు ఇలాంటి ఆలోచన‌ల‌కు శ్రీకారం చుట్టి, మ‌రో వైపు సామాజిక వ‌ర్గంతో పాటు ఇత‌ర విష‌యాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటున్న సీఎం కేసీఆర్, ఒకానొక ద‌శ‌లో ఉప ముఖ్యమంత్రి క‌డియం శ్రీహరి కూతురు ను సైతం బ‌రిలోకి దింపాల‌నే యోచ‌న‌లో కూడా లేక‌పోలేద‌ని అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.


ఇక‌పోతే గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో పొత్తు పెట్టుకుని రంగంలోకి దిగిన భాజాపా, టీడీపీ లు అదే పొత్తుతోనే వ‌రంగ‌ల్ ఎన్నిక‌ల‌కు వెళ్ల‌నున్న‌ట్లు ప్ర‌క‌టించాయి. కాక‌పోతే ఇరువురి మ‌ద్య అభ్య‌ర్ది పై ఇంత‌వ‌ర‌కు క్లారిటీ రాలేదు. మ‌రోవైపు వామ‌ప‌క్షాలైన సీసీఐ, సీపీయం లు క‌లిసి ఈ ఎల‌క్ష‌న్ అమీతుమీ తేల్చుకునే ప‌నిలో పడ్డారు. ప్ర‌త్యేక తెలంగాణ ఉద్య‌మ‌కార‌ణంగా సీపీఎం కు ఇక్క‌డి ప్రాంతంలో తీవ్ర వ్య‌తిరేక‌త వ‌చ్చింది. సీపీఐ పార్టీ తెలంగాణ ఉద్య‌మంలో పాల్గోన్న నేప‌థ్యంలో సానుకూలంగా ఉన్నా.. అభ్య‌ర్ధి లేమీ ఎర్ప‌డింది దీంతో తెలంగాణ ఉద్య‌మ‌కారుడు, ప్ర‌జాయుద్ద నౌక గద్ద‌ర్ ను బ‌రిలోకి దించాల‌ని ఇరు పార్టీల నాయ‌కులు భావిస్తున్నారు. గ‌ద్ద‌ర్ కు ఒక తెలంగాణ‌లోనే కాకుండా యావ‌త్తు దేశంలోనే మంచి ప‌ట్టే ఉంది. ఈ నేప‌థ్యంలో టీఆర్ఎస్ పార్టీ ని ఢీ కొట్టాలంటే గ‌ద్ద‌ర్ తోనే సాధ్య‌మ‌ని భావించాయి. కానీ గ‌ద్ద‌ర్ నుంచి ఏలాంటి సానుకూలత రాక‌పోవ‌డంతో వామ‌ప‌క్షాల అభ్య‌ర్ధి పై సందిగ్ద‌త నెల‌కొంది.


ఇక ప్ర‌దాన ప్ర‌తి ప‌క్ష‌మైన కాంగ్రెస్ పార్టీ పైతం క‌స‌ర‌త్తు మొద‌లు పెట్టింది. ఇప్ప‌టికిప్పుడు తమ అభ్య‌ర్ది పై ఓ స్ప‌ష్టత ఇవ్వ‌లేమ‌ని భావించిన కాంగ్రెస్, అధికార పార్టీ క‌ట్టడిచేసే ప‌ని మాత్రం గ‌ట్టిగానే చేస్తోంది. ఇక‌పోతే గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో గులాబీ జెండా ను  ఎగురువేయాల‌ని టీఆర్ఎస్ భావిస్తోంది. ఇప్ప‌టికే ఆ పార్టీ సీఎం కేసీఆర్, పార్టీ నేత‌లు త‌మ‌దైన శైలీలో ముందుకు సాగుతున్న‌ట్లు సమాచారం. ఈ విష‌యంలో కాంగ్రెస్ సైతం ప‌ట్టుద‌ల‌గా ముందుకు పోతుంది. నియోజ‌క‌వ‌ర్గాల్లో స‌మావేశాలు సమీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు. ఇక టీడీపీ, బీజేపీ పొత్తుల వ్య‌వ‌హ‌రం కావ‌డంతో ఆయా పార్టీలు అంత‌ర్గ‌త చ‌ర్చ‌లు సాగిస్తున్నా..పూర్తిస్థాయిలో మాత్రం రాజ‌కీయ పార్టీలు గ్రేట‌ర్ ఎన్నిక‌ల‌పై దృష్టి సారించ‌డంలేదు.  ఇక అంతేకాకుండా స్థానిక సంస్థ‌లకు సంబంధించి శాస‌న‌మండ‌లి ఎన్నిక‌ల‌ను జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో మ‌రోసారి తెలంగాణ లో ఎన్నిక‌ల వాతావ‌ర‌ణం నెల‌కొన‌నుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: