ముంబాయిలో జైనుల పర్వదినాల సందర్భంగా నాలుగురోజుల పాటు నగరవ్యాప్తంగా మాంసం విక్రయాలను నిషేధించినందుకు ఎంతపెద్ద ఎత్తున రభస జరిగిందో అందరికీ తెలుసు. ఇది జనం హక్కులను హరించడమే అని తటస్థ వాదులు అరచి గీపెడితే.. ముస్లింలను అవమానించి నట్లే ఈ నిర్ణయం ఉన్నదని.. జైనుల పడుగలకు మాంసం నిషేధిస్తే బక్రీద్‌ పండుగకు ఇంటింటికీ మాంసం పంచుతారా అని అసదుద్దీన్‌ ఒవైసీ ప్రశ్నించారు. చివరికి కోర్టుకూడా ముంబాయి సర్కారుకు ఈ విషయంలో అక్షింతలు వేసింది. ఎట్టకేలకు రెండురోజులు మాత్రం నిషేధించేలా ఒక ఒప్పందంతో.. కోర్టు తీర్పు మేరకు వ్యవహారం సద్దు మణిగింది. 


కేవలం నాలుగురోజులు, అదికూడా ఒకే నగరంలో మాంసాహారాన్ని నిషేధించినందుకే ఇంత పెద్ద రభస జరిగిందే.. ఇక దేశవ్యాప్తంగా పది రోజుల పాటూ మాంసాహారం ఉండరాదనే ఆదేశాలు వస్తే ఇంకెంత గోల అయిపోతుందో ఊహించడం సాధ్యమేనా? అలాంటి పరిస్థితి వచ్చే నెలలోనే వస్తుందేమో అని అనిపిస్తోంది. దసరా నవరాత్రుల సందర్భంగా ఆ తొమ్మిదిరోజులపాటూ దేశవ్యాప్తంగా మాంసాహార విక్రయాలపై నిషేధం విధించడం గురించి ఆలోచిస్తున్నట్లు కేంద్ర పర్యాటక మంత్రి మహేశ్‌ శర్మ వెల్లడించి ఈ వివాదానికి తెర తీస్తున్నారు. 


దీనికి సంబంధించి ఇప్పటిదాకా ఆదేశాలు ఏమీ వెలువడలేదుగానీ.. అలాంటిదేమైనా జరిగిందంటే.. దేశవ్యాప్తంగా ఉద్యమాలు, ఆందోళనలు అన్నీ మొదలవుతాయని పలువురు అంటున్నారు. అసలు చాలా ప్రాంతాల్లో మాంసాహారాన్ని విధిగా ప్రతిరోజూ తీసుకునే కనీస ఆహారంగా భావిస్తుంటారు. అలాంటిది.. దేశమంతా.. తాము చెప్పినట్లే జీవించాలంటూ.. ప్రభుత్వాలు ఇలాంటి ఆదేశాలు తేవడం సమంజసం కాదని ప్రజలు భావిస్తున్నారు. హిందూత్వ, మరియు సంస్కృతీ పరిరక్షణ అనే పదాల ముసుగులో దేశం మొత్తంలో తమ ఇష్టారాజ్యం సాగాలని మోడీ టీం భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: