ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి మీడియా ఏపీ సీఎంకు అనుకూలంగా వార్తలు ఇస్తుందని పబ్లిక్ టాక్.. మరి అలాంటిది బుధవారం ఏబీఎన్ గ్రూపు ఏపీ సీఎం చంద్రబాబుకు షాక్ ఇచ్చింది. అసలు విషయం ఏంటంటే.. ఏపీ ప్రభుత్వ కార్యక్రమాలు ఏవైనా ప్రత్యేక్షప్రసారం చేయించే హక్కు ఒక్క ఏబీఎన్ కే సర్కారు ఇచ్చింది. ఇది ఓ ఒప్పందం మేరకు జరిగిన నిర్ణయం. 

దీనివల్ల ఏబీఎన్ ఛానల్ కు భారీ ఎత్తున లబ్ది చేకూరుతుందని మీడియా సర్కిళ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే అలాంటి ఏబీఎన్.. బుధవారం బాబుకు భలే షాక్ ఇచ్చింది. గోదావరి - కృష్ణా అనుసంధానం పూర్తయిందని.. ఇలాంటి అపూరూప ఘట్టం దేశంలో ఇదే తొలిసారని సర్కారు అనూకూల ఛానళ్లు ఊదరగొడుతున్న సమయంలో.. టెలికాస్టులో సాంకేతిక సమస్యలు వచ్చాయి. 

గోదావరి-కృష్ణమ్మ కలయికను అపూరుప అపూర్వ ఘట్టంగా వర్ణించిన టీడీపీ నేతలు.. దాన్ని లైవ్ టెలికాస్టు చేసి..అనుకూల ఛానళ్లలో ఊదరగొట్టాలని డిసైడ్ అయ్యాయి. అందుకు తగ్గట్టుగానే ఉదయం నుంచి సదరు ఛానళ్లు ప్రచారంతో హోరెత్తించాయి. తీరా సరిగ్గా సంగమ సమయం దగ్గరకు రాగానే.. లైవ్ టెలికాస్ట్ లో సమస్యలు వచ్చాయి. 

కృష్ణా-గోదావరీ సంగమ దృశ్యాలను ఏ ఛానల్ కూడా లైవ్ చూపించలేకపోయింది. అంతేకాదు.. సంగమ సమయంలో ఓ బహిరంగ సభ కూడా నిర్వహించారు. ఆ లైవ్ టెలికాస్ట్ కూడా ఫెయిలైంది. సర్కారు కార్యక్రమాల ప్రసారం బాధ్యతలు ఏబీఎన్ కు ఇచ్చినందువల్ల.. మిగిలిన మీడియాల లైవ్ వాహనాలను అక్కడకు అనుమతించలేదు.. ఉన్న ఏబీఎన్ ఫెయిలైంది.. సో.. మొత్తానికి చారిత్రక ఘట్టమంటూ చెప్పుకొచ్చిన ఆ కార్యక్రమం లైవ్ మాత్రం ఇవ్వలేక చతికిలపడింది ఏబీఎన్. 



మరింత సమాచారం తెలుసుకోండి: