గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సీమాంద్రుల ఓట్లను పెద్ద ఎత్తున తొలగిస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ ఆరోపించింది. ఆ పార్టీ అధ్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి ఈ ఆరోపణ చేస్తూ పదిహేడు లక్షల మంది సీమాంద్రుల ఓట్లను గ్రేటర్ హైదరాబాద్ పరిదిలో తొలగించడానికి కుట్ర జరుగుతోందని అన్నారు.ఒక్క సనత్ నగర్ నియోజకవర్గంలోనే ముప్పై ఒక్క వేల ఓట్లను తొలగించడానికి రంగం సిద్దం చేస్తున్నారని ఆయన అన్నారు. ఓట్ల తొలగింపు కార్యక్రమం అంతా జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ కనుసన్నల్లోనే సాగుతోందన్నారు. దాదాపు 17 లక్షల మంది ఓట్లను తొలగించేందుకు కుట్ర జరుగుతోందని తెలిపారు.

ఒక్క సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోనే 31 వేల మంది ఓట్లను తొలగించేందుకు మార్క్ చేసినట్టు ఉత్తమ్ తెలిపారు. దీనిపై తాము కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని ఆయన తెలిపారు. హైదరాబాద్ లో వార్డుల విభజన, రిజర్వేషన్ లలో కూడా అక్రమాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఓట్ల తొలగింపుపై తెలంగాణ వర్కిగ్‌ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ నేతలు శుక్రవారం సాయంత్రం ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌ను కలిశారు. అనంతరం మీడియాతో భట్టి మాట్లాడుతూ జీహెచ్‌ఎంసీలో అక్రమంగా ఓట్లు తొలగిస్తున్నారని ఫిర్యాదు చేశామని తెలిపారు.

ఓట్లు వేస్తున్నదృశ్యం


ఓట్లు తొలగింపు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని ఆయన విమర్శించారు. తొలగించిన వారి పేర్లను వెబ్‌సైట్‌లో పెట్టాలని కోరామని చెప్పారు. ఓట్లను తొలగించినవారిపై చర్యలు తీసుకుంటామని భన్వర్‌లాల్ చెప్పినట్లు విక్రమార్క వెల్లడించారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి  గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సీమాంధ్రుల ఓటర్లను తొలగిస్తూ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: