పాపం జగన్ ఏ ముహూర్తాన ప్రత్యేక హోదా కోసం ఆమరణ దీక్ష చేయాలని నిర్ణయించుకున్నారో గానీ.. ఆ దీక్షకు అన్నీ ఇబ్బందులే ఎదురవుతున్నాయి. ప్రత్యేక హోదాపై ఆమరణ దీక్ష చేస్తామని ప్రకటించిన తర్వాత ఇప్పటికీ ఆరుసార్లు ఆ దీక్ష ముహూర్తం మార్చారు. గుంటూరులో పోలీసులు అనుమతి నిరాకరణ, హైకోర్టు తీర్పు నేపథ్యంలో జగన్ దీక్ష సమయం మరోసారి మారింది. 

ఈసారి అన్నివిధాలా ఆలోచించి వచ్చే నెల 7 తారీఖున దీక్ష చేయాలని నిర్ణయించారు. ఆరోజు బుధవారం వస్తోంది. ఐతే.. జగన్ నిరవధిక దీక్ష అంటే ఆపకుండా దీక్ష కొనసాగించాలి.. కానీ జగన్ కు ప్రతి శుక్రవారం వెరీ ఇంపార్టెంట్ షెడ్యూల్ ఉంది. ప్రతి శుక్రవారం ఆయన సీబీఐ కేసుల విషయంలో సీబీఐ కోర్టు ఎదుట తప్పుకుండా హాజరు కావాల్సి ఉంటుంది. 

సో.. అన్నీ అనుకూలించి.. సర్కారు అనుమతులు ఇచ్చి జగన్ బుధవారం దీక్ష ప్రారంభింస్తే.. కేవలం రెండు రోజులే దీక్ష చేయగలుగుతారు. శుక్రవారం కోర్టు హాజరుకు ఇబ్బంది అవుతుంది. ఈ అడ్డంకి తప్పించుకోవాలంటే.. ముందుగానే కోర్టు నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. మరి జగన్ ఆ అనుమతి సాధించగలుగుతారా.. అలా చేస్తేనే నిరవధిక దీక్ష కనీసం ఐదారు రోజులు చేయగలుగుతారు. 

ఐతే.. జగన్ ఇప్పటివరకూ సుదీర్ఘమైన దీక్షలు చేసిన చరిత్ర లేదు. అంతే కాదు.. 28 గంటల దీక్ష, 48 గంటల నిరాహారదీక్ష అంటూ కొత్త షార్ట్ టెర్మ్ దీక్షల ట్రెండ్ కు జగన్ పాపులారిటీ తెచ్చేశారు కూడా. మరి ఆయన కనీసం ఓ వారం రోజులపాటు దీక్ష చేయగలుగుతారా.. కనీసం నాలుగైదు రోజులు కూడా దీక్ష కొనసాగించలేకపోతే..దాని ఇంపాక్ట్ అంతగా ఉండదు.. కొండంత రాగం తీసి.. ఏదో పాట పాడినట్టు అయిపోతుంది. మరి జగన్ ఎలా నెగ్గుకొస్తారో..?



మరింత సమాచారం తెలుసుకోండి: