సీఎల్పీ కార్యాలయంలో ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణరెడ్డి, విప్లు సి.అనిల్, రుద్రరాజు పద్మరాజు, శాసన సభ్యులు డి.సుధీర్ రెడ్డి, వీరశివారెడ్డి విలేకరులతో మాట్లాడురు. పార్టీ అధ్యక్ష్యనిగా ప్రతిపక్ష నాయకునిగా బాబు జోడు పదవులను నిర్వహిస్తున్నారని వాటిల్లోంచి ఏదో ఒక పదవిని బీసీలకు అప్పగిస్తే ఆ వర్గాలు నమ్మె పరిస్థితి ఉంటుందని చీఫ్ విప్ అభిప్రాయడ్డారు. గత ఎన్నికల్లో కూడా బాబు బీసీలకు చుక్కలు చూపించారని ఆ వర్గాలు గెలవలేని సీట్లను కేటాయించిన వాస్తవాన్ని బీసీలు ఇంకా మర్చిపోలేదని చెప్పారు. ఇదిలా ఉండగా పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ప్రారంభించిన రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కొనసాగింపుపై కొన్ని పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తూ లేనిపోని అనుమానాలను సృష్టించటాన్ని వారు ఖండించారు. ఈ పథకం ఖచ్చితంగా కొనసాగుతుందని, అయితే 108 నిర్వహణలో ప్రభుత్వం జీవీకే మధ్య కొంత అవగాహనలోపం వల్ల ఇబ్బందులు ఏర్పడ్డాయని అయిన వాటిని కూడా అధికమించడమైందని గండ్ర వెంకటరమణారెడ్డి తెలిపారు. పేద వర్గాలకు ఎలాంటి జబ్బు వచ్చినా వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని పలుసార్లు ఈ పథకం ద్వారా నిరూపించడమైందని, ఇందులో ఖర్చుపై సీలింగ్ అనేది లేదని అన్నారు. ఈ పథకంపై బహిరంగ చర్చకు సిద్దమని సవాల్ విసిరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: