అవినీతి అక్రమాల ఆరోపణలు ఎదుర్కొంటు సుప్రీం కోర్టు నోటీసులు అందుకున్న మంత్రులకు న్యాయసహాయాన్ని అందించాలని తీసుకున్న నిర్ణయాన్ని ఏఐసీసీ కార్యదర్శి శాసనమండలి సభ్యలు పొంగులేటి సుధాకర్ రెడ్డి పూర్తిగా వ్యతిరేకించారు. ప్రభుత్వం నుంచి న్యాయసహాయం అందించటం ఏమిటనీ ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వానికి బదులుగా పార్టీపరంగా సహాయం అందించాలని సూచించారు. సిఎల్పీ కార్యలయం వద్ద పొంగులేటి విలేకరులతో మాట్లుడారు. ఆరోపణలు ఎదుర్కోంటున్న వారికి వారికి న్యాయసహాయం చేయాలని నిర్ణయించటం కొత్త సాంప్రదాయానికి నాంది పలకడమేనని, భవిష్యత్తులో అధికారంలోకి ఎవరు వచ్చినా , అధికారంలో ఉన్నవారిపై ఎలాంటి ఆరోపణలు వచ్చిన వారికి ఆ ప్రభుత్వం న్యాయసహాయం అందించటానికి ఈ నిర్ణయం అవకాశమిస్తుందని, ఇది మంచి సాంప్రాదాయం కాదని పొంగులేటి అన్నారు. కాగా యుపీఏ రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీ వ్యక్తిత్వాన్ని కించపర్చే విధంగా కొన్ని పార్టీల నాయకులు వ్యాఖ్యలు చేయడంపట్ల ఏఐసీసీ కార్యదర్శి బాధను వ్యక్తం చేశారు. కాంగ్రెస్ను వ్యతిరేకిస్తున్న సీపీఎం, శివసేన వంటి పార్టీలు కూడా ప్రణబ్కు మద్దతునిస్తున్నాయని గుర్తుచేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: