తెలంగాణ రాష్ట్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఫిల్మ ఇనిస్టిట్యూట్‌ను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు బాలీవుడ్ ప్రముఖ నిర్మాత, దర్శకుడు సుభాష్ ఘాయ్ సోమవారంనాడు ప్రకటించారు.ప్రముఖ బాలీవుడ్ సిని నిర్మాత దర్శకుడు సుభాష్ ఘాయ్ పంచాయితీరాజ్ మరియు ఐటి శాఖ మంత్రి కె.తారక రామారావుని సచివాలయంలో కలిసారు. తెలంగాణ ప్రభుత్వం కొత్త రాష్ర్టంలో సిని పరిశ్రమ అభివృద్దికి చేపట్టిన కార్యక్రమాల పట్ల హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ర్టంతో పనిచేసేందుకు తాము సిద్దంగా ఉన్నామని మంత్రికి తెలియజేశారు.

తెలంగాణలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఓక పిల్మ్ ఇన్ట్సిట్యూట్ ని ఏర్పాటు చేసేందుకు సిద్దంగా ఉన్నామన్నారు.. ఈ మేరకి తమ వద్ద ఉన్న ప్రణాళికను వివరించారు. అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ సినిమా, వినోద రంగాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలను వివరించారు. ప్రభుత్వం తలపెట్టిన గేమింగ్ సిటీలో భాగస్వాములు కావాలని సుభాష్ ఘాయ్‌ని కోరారు. తమ ప్రభుత్వం రాచకొండ వద్ద అంతర్జాతీయ స్ధాయిలో అత్యున్నత ప్రమాణాలతో చేపట్టనున్న పిల్మ్ సిటీ గురించి వివరించిన మంత్రి...అక్కడ సుభాష్ ఘాయ్ సంస్ధ విజిలింగ్ వూడ్స్ సంస్ధ ఏర్పాటుని పరిశీలించాలని కోరారు.

ఈ ప్రతిపాదన పట్ల హర్షం వ్యక్తం చేసిన సుభాష్ ఘాయ్ సానుకూలంగా స్పందించారు.  సినీ రంగంలో స్థానిక యువకులకు అవకాశాలు దక్కేలా, వారిలో ఉన్న ప్రతిభను వెలుగులోకి తీసుకుని వచ్చేలా ప్రణాళికలు రూపొందించాలని సుభాష్ ఘాయ్‌కి మంత్రి కెటిఆర్ సూచించారు.   ప్రభుత్వం తలపెట్టిన గేమింగ్ సిటీలో భాగస్వాములు కావాలని సుభాష్ ఘాయ్‌ని కోరారు. రాచకొండ వద్ద అంతర్జాతీయస్థాయిలో అత్యున్నత ప్రమాణాలతో చేపట్టనున్న ఫిల్మ్ సిటీ గురించి వివరించిన కెటిఆర్.... అక్కడ సుభాష్ ఘాయ్ సంస్థ విజిలింగ్ ఉడ్స్ ఏర్పాటును పరిశీలించాలని కోరారు. 

కేటీఆర్ ట్విట్టర్ : 

మరింత సమాచారం తెలుసుకోండి: